Reliance Jio Plan : జియో బంపర్ ఆఫర్.. 90 రోజుల రీఛార్జ్ ప్లాన్ భలే ఉంది.. ఫ్రీ కాలింగ్, 200GB డేటా.. OTT బెనిఫిట్స్ కూడా!
Reliance Jio Plan : రిలయన్స్ జియో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో కస్టమర్లకు 90 రోజుల వ్యాలిడిటీతో పాటు ప్యాక్‌లో అదనపు ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు.

Reliance Jio Plan
Reliance Jio Plan : రిలయన్స్ జియో కోట్లాది మంది కస్టమర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. జియో చౌకైన, ఖరీదైన ప్లాన్‌లు రెండూ అందుబాటులో ఉన్నాయి. మీ అవసరానికి తగ్గట్టుగా మీరు ఏదైనా ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
దేశంలోని నంబర్ వన్ టెలికాం కంపెనీ ఇప్పుడు 90 రోజుల పాటు రీఛార్జ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇటీవలి కాలంలో డేటా, ఓటీటీ యాప్‌లకు డిమాండ్ చాలా వేగంగా పెరిగింది. కస్టమర్లను ఆకట్టుకునేలా జియో పోర్ట్‌ఫోలియోలో OTT సబ్‌స్క్రిప్షన్, అదనపు డేటాను ఉచితంగా అందించే అనేక ప్లాన్‌లను చేర్చింది. అలాంటి చౌకైన, సరసమైన రీఛార్జ్ ప్లాన్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
జియో 90 రోజుల ప్లాన్ :
46 కోట్ల మంది కస్టమర్ల కోసం రిలయన్స్ జియో పోర్ట్‌ఫోలియోను విభజించింది. జియో 2GB డేటాతో కూడిన ప్లాన్ కేటగిరీని కలిగి ఉంది. ఈ విభాగంలో జియో 90 రోజుల బ్యాంగ్ రీఛార్జ్ ప్లాన్‌ను చేర్చింది. ఇందులో, లాంగ్ వ్యాలిడిటీతో పాటు ఫ్రీ కాలింగ్‌తో సహా అనేక ఇతర ఆఫర్లను పొందవచ్చు. జియో రీఛార్జ్ ప్లాన్ రూ. 899 ధరకు వస్తుంది. ఈ ప్లాన్‌లో కంపెనీ అన్ని లోకల్, ఎస్టీడీ నెట్‌వర్క్‌లలో 90 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది.
ఈ ప్లాన్‌తో మీరు ఒకేసారి 3 నెలలు రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ యూజర్లు అన్ని నెట్‌వర్క్‌లకు రోజుకు 100 ఫ్రీ SMS కూడా పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ ఎక్కువ డేటా అవసరమయ్యే కస్టమర్లకు బెస్ట్ ప్లాన్.
జియో 90 రోజులకు మొత్తం 180GB డేటాను అందిస్తుంది. మీరు రోజుకు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ కస్టమర్లు 20GB డేటాను అదనంగా పొందవచ్చు. మీకు 90 రోజుల పాటు మొత్తం 200GB డేటా అందిస్తోంది.
ఓటీటీ, క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యం :
రిలయన్స్ జియో రూ.899 ప్లాన్‌పై అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది. కంపెనీ యూజర్లకు జియో హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్ 90 రోజుల పాటు అందిస్తుంది. అంతేకాదు.. 50GB జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా అందుబాటులో ఉంది. టీవీ ఛానెల్స్ చూసేందుకు కంపెనీ కస్టమర్లకు జియో టీవీని ఫ్రీగా యాక్సెస్ అందిస్తుంది.