Airtel Family Plans : ఎయిర్‌టెల్ ఫ్యామిలీ ప్లాన్లు అదుర్స్.. సింగిల్ రీఛార్జ్‌తో 2 సిమ్‌లకు వాడుకోవచ్చు.. ఫ్రీగా హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో చూడొచ్చు!

Airtel Family Plans : ఎయిర్‌‌టెల్ కస్టమర్ల కోసం ఫ్యామిలీ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జ్ ప్లాన్లతో ఎక్కువగా డేటా బెనిఫిట్స్, ఓటీటీ స్ట్రీమింగ్ కంటెంట్ ఉచితంగా చూడొచ్చు.

Airtel Family Plans : ఎయిర్‌టెల్ ఫ్యామిలీ ప్లాన్లు అదుర్స్.. సింగిల్ రీఛార్జ్‌తో 2 సిమ్‌లకు వాడుకోవచ్చు.. ఫ్రీగా హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో చూడొచ్చు!

Airtel Family Plans

Updated On : April 6, 2025 / 12:08 PM IST

Airtel Family Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ బిగ్ యూజర్లను ఆకట్టుకునేందుకు అద్భుతమైన బెనిఫిట్స్‌తో ఫ్యామిలీ ప్లాన్లను తీసుకొచ్చింది. ఎయిర్‌‌టెల్ అందించే కొత్త ఫ్యామిలీ ప్లాన్లలో రూ.699కి 2 సిమ్‌లు, రూ.999కి 3 సిమ్‌లు, రూ.1199కి 4 సిమ్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్‌లలో డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, OTT సబ్‌స్క్రిప్షన్‌ వంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతోంది.

Read Also : WhatsApp : మీ వాట్సాప్‌లో ఇలా చేస్తే.. ఫొటోలు, వీడియోలు ఏమైనా ఆటో డౌన్‌లోడ్ కాకుండా ఆపొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

ఇందులో, వినియోగదారులకు అనేక డేటా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కానీ, ఎయిర్‌టెల్ కొన్ని ప్లాన్లలో ఫ్యామిలీ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. మీరు సింగిల్ రీఛార్జ్‌తో 2 సిమ్ కార్డులకు అదే బెనిఫిట్స్ వాడుకోవచ్చు. వాస్తవానికి ఈ ప్లాన్లు ఫ్యామిలీ ఇన్ఫినిటీ పేరుతో వస్తాయి. ఇందులో, వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్రయోజనాలు పొందవచ్చు. ఎయిర్‌టెల్ అందించే ఈ ఫ్యామిలీ ప్లాన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ రూ. 699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ :
ఈ ప్లాన్ 1+1తో వస్తుంది. మీరు ప్రైమరీ సిమ్ కార్డ్‌ని ఎంచుకోవాలి. అప్పుడే ఈ ప్లాన్ వర్తిస్తుంది. ప్రైమరీ సిమ్‌తో పాటు మరో సిమ్ కార్డ్ ఆప్షన్ అందిస్తుంది. మీరు ఇది కూడా వాడుకోవచ్చు. ఈ ప్లాన్ చిన్న ఫ్యామిలీల కోసం తీసుకొచ్చింది. రూ. 699పై 18శాతం జీఎస్టీ ఉంటుంది. డేటా పరంగా ఈ ప్లాన్‌లో 105GB వరకు డేటా పొందవచ్చు. కుటుంబ సభ్యులందరూ ఈ డేటాను ఉపయోగించవచ్చు. అంతేకాదు.. ఈ ప్లాన్‌లో OTT సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తోంది.

ఇందులో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఒక ఏడాది ఎంజాయ్ చేయొచ్చు. అమెజాన్ ప్రైమ్, ఎక్స్‌స్ట్రీమ్ కూడా 6 నెలల పాటు పొందవచ్చు. మొత్తం ఫ్యామిలీకి అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్మెంట్ పొందవచ్చు. ఇందులో డేటా రోల్‌ఓవర్ సౌకర్యం కూడా వేరుగా పొందవచ్చు. పాత డేటా కూడా ఫార్వార్డ్ అవుతుంది. మీరు మిగిలిన వాడని డేటాను వచ్చే నెల వరకు ఉపయోగించవచ్చు. వినియోగదారులకు రోజుకు 100 SMS పొందవచ్చు.

ఎయిర్‌టెల్ 3 కనెక్షన్లతో ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ. 999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే.. ఇందులో మొత్తం 3 కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. దాంతో పాటు 150GB వరకు డేటా రోల్-ఓవర్ సౌకర్యం కూడా పొందొచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో రోజుకు 100 SMS పొందవచ్చు.

డిస్నీ+ హాట్‌స్టార్ కూడా 12 నెలల పాటు పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ 6 నెలల సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. దాంతో పాటు, ఎయిర్‌టెల్ మరింత డేటాను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లలో మీరు ఫ్రీ హలో ట్యూన్ కూడా ఇవ్వవచ్చు.

Read Also : Whatsapp Status : వాట్సాప్‌లో క్రేజీ ఫీచర్.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కూడా స్టేటస్‌లో పెట్టుకోవచ్చు తెలుసా? ఆడియో కూడా వినిపిస్తుంది!

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌లన్నీ ఫ్యామిలీ ప్లాన్‌ల జాబితాలో అందుబాటులో ఉన్నాయి. మీకు ఆసక్తి ఉంటే.. ఎయిర్‌టెల్ రూ.1199 ప్లాన్ ద్వారా 4 కనెక్షన్లు తీసుకోవచ్చు. మరో ప్లాన్ రూ.1399కి వస్తుంది. ఇందులో కూడా 4 కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, డేటా ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. మీరు 5 కనెక్షన్లతో కూడిన ప్లాన్ కోసం చూస్తుంటే మీరు 1749 ప్లాన్‌ను కూడా ఎంచుకోవచ్చు.