WhatsApp : మీ వాట్సాప్‌లో ఇలా చేస్తే.. ఫొటోలు, వీడియోలు ఏమైనా ఆటో డౌన్‌లోడ్ కాకుండా ఆపొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..
WhatsApp : వాట్సాప్ యూజర్లు ఫొటోలు, వీడియోలను మీ ఫోన్ గ్యాలరీలో ఆటో డౌన్ లోడ్ కాకుండా ఎలా ఆఫ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp from auto-downloading media
WhatsApp : వాట్సాప్ వాడుతున్నారా? మీ వాట్సాప్‌లో చాట్, గ్రూపులలో ఫొటోలు, వీడియోలు ఆటో డౌన్‌లోడ్ అవుతున్నాయా? అయితే, ఇకపై ఆటో డౌన్‌లోడ్ కాకుండా స్టాప్ చేయొచ్చు. సాధారణంగా వాట్సాప్ యూజర్లు ముఖ్యమైన ఫైల్స్, ఫొటోలు, GIF, గుడ్ మార్నింగ్ వంటి మెసేజ్‌లను షేర్ చేస్తుంటారు.
ప్రతిరోజు అవసరమైన ఫొటోల కన్నా ఎక్కువగా మీడియా స్టోరేజీలో వచ్చి చేరుతుంటాయి. వాట్సాప్ ఫొటోలు, వీడియోలు ఆటో డౌన్‌లోడ్ కారణంగా మీ ఫోన్ స్టోరేజీ వెంటనే నిండిపోతుంది. దాంతో ఫోన్ బాగా స్లో అవుతుంది.
Read Also : WhatsApp Status : వాట్సాప్ స్టేటస్‌లో కూడా లొకేషన్ షేర్ చేయొచ్చు తెలుసా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!
దాంతో చాలామంది వాట్సాప్ యూజర్లు అవసరంలేని వాట్సాప్ మీడియా ఫైల్స్ డిలీట్ చేస్తుంటారు. ప్రతిసారి మీ గ్యాలరీ నుంచి వాటిని డిలీట్ చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే, వాట్సాప్ యూజర్లు తమ స్టోరేజీ ఫుల్ కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఆటో డౌన్‌లోడ్ మీడియా సెట్టింగ్ డిసేబుల్ చేయండి.
ఈ కింది విధంగా ఆటో-డౌన్‌లోడ్‌ను ఆఫ్ చేయవచ్చు. దాంతో మీ గ్యాలరీలో అవసరం లేని మెసేజ్‌లు సేవ్ కాకుండా చేయవచ్చు. అయితే, ఈ ప్రక్రియ iOS, Android యూజర్లకు భిన్నంగా ఉంటుంది. అనవసరమైన ఫొటోలు లేదా ఫైల్స్ మీ గ్యాలరీలో స్టోర్ కాకుండా స్టోరేజీ స్పేస్ ఎలా సేవ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఆటో-డౌన్‌లోడ్ ఆఫ్ చేయాలంటే? :
- మీ వాట్సాప్ ఓపెన్ చేసి Settings ఆప్షన్ ట్యాప్ చేయండి.
- మీ చాట్స్ ఆప్షన్ ఎంచుకుని ఓపెన్ చేయండి.
- మీడియా visibility టర్న్ ఆఫ్ చేయండి.
నిర్దిష్ట చాట్స్ లేదా గ్రూపులో ఆటో-డౌన్‌లోడ్ టర్న్ ఆఫ్ చేయాలంటే? :
- మీ వాట్సాప్ ఓపెన్ చేసి Settings ఆప్షన్ ఎంచుకోండి.
- చాట్‌లపై క్లిక్ చేసి వ్యక్తిగత లేదా గ్రూపు చాట్‌పై ట్యాప్ చేయండి.
- కాంటాక్టు ఇన్ఫో లేదా గ్రూపు ఇన్ఫో కోసం కాంటాక్టు లేదా గ్రూపు నేమ్ ట్యాప్ చేయండి.
- మీడియా విజిబిలిటీ No ఆప్షన్ ఎంచుకుని OK క్లిక్ చేయండి.
ఐఫోన్‌లో ఆటో-డౌన్‌లోడ్ ఎలా ఆపాలంటే? :
- మీ వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌పై ట్యాప్ చేయండి.
- చాట్స్ ఆప్షన్ ఎంచుకుని ఓపెన్ చేయండి.
- ఫొటోలకు సేవింగ్ డౌన్‌లోడ్ ఆఫ్ చేయండి.
చాట్స్, గ్రూపులలో ఆటో-డౌన్‌లోడ్ ఎలా ఆఫ్ చేయాలి? :
- మీ వాట్సాప్ ఓపెన్ సెట్టింగ్‌పై ట్యాప్ చేయండి.
- చాట్‌లపై క్లిక్ చేసి పర్సనల్ లేదా గ్రూపు చాట్‌పై ట్యాప్ చేయండి.
- కాంటాక్టు ఇన్ఫో లేదా గ్రూపు ఇన్ఫో కాంటాక్టు లేదా గ్రూపు పేరును ట్యాప్ చేయండి.
- ఫోటోలకు Save ఆప్షన్ ఎంచుకుని Never ఎంచుకోండి.
వాట్సాప్ గ్యాలరీలో హైడ్ ఫోల్డర్ క్రియేట్ చేయడం ఎలా? :
Read Also : Samsung Galaxy S24 Ultra 5G : సూపర్ ఆఫర్ బ్రో.. ఈ శాంసంగ్ 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో ఎంతంటే?
- (Google Play Store) నుంచి ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో, ఫొటోలు/వాట్సాప్ ఫొటోస్ సెక్షన్‌కు వెళ్లండి.
- డాట్ సహా (.nomedia) అనే ఫైల్‌ను క్రియేట్ చేయండి.
- మీ ఫోన్ గ్యాలరీలో హైడ్ చేసిన ఫొటోలను తర్వాత చూడాలంటే (.nomedia) ఫైల్‌ను డిలీట్ చేస్తే సరి.
- ఈ సెట్టింగ్‌ను మార్చడం వల్ల చాట్స్ లేదా గ్రూపులలో పాత ఫొటోల ఆటో-డౌన్‌లోడ్ ఆప్షన్లపై ఎఫెక్ట్ పడదు.
- ఆండ్రాయిడ్ ఫైల్స్ మీ లోకల్ స్టోరేజీలోని వాట్సాప్ మీడియా ఫోల్డర్‌లో ఆటోమాటిక్‌గా సేవ్ అవుతాయి.