Samsung Galaxy S24 Ultra 5G : సూపర్ ఆఫర్ బ్రో.. ఈ శాంసంగ్ 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో ఎంతంటే?
Samsung Galaxy S24 Ultra 5G : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ భారీ తగ్గింపు ధరతో అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy S24 Ultra 5G
Samsung Galaxy S24 Ultra 5G : శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. శాంసంగ్ కొత్త ఫోన్ ధర భారీగా తగ్గింది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ ధర అమెజాన్‌లో ఏకంగా రూ.41వేలకు తగ్గింది. మీరు రూ.90వేల కన్నా తక్కువ బడ్జెట్‌తో ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇదే సరైన ఆఫర్.
అమెజాన్‌లో (Samsung Galaxy S24 Ultra 5G) డీల్‌ను మిస్ అసలు మిస్ చేసుకోవద్దు. అమెజాన్ ధర తగ్గింపు, బ్యాంక్ ఆఫర్ ద్వారా కస్టమర్‌లు ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై రూ.31వేలు కన్నా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. సాధారణంగా భారతీయ మార్కెట్లో దాదాపు రూ.1,29,900కి అందుబాటులో ఉంటుంది.
గత జనరేషన్ శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్, డ్యూయల్ టెలిఫోటో లెన్స్‌తో క్వాడ్ కెమెరా సెటప్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద అమోల్డ్ స్క్రీన్, ఏఐ ఫీచర్లు మరెన్నో వంటి అనేక రకాల ఫీచర్లు, పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్‌లను అందిస్తుంది. మీరు మీ పాత ఫోన్ ప్రీమియంతో అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ధరను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ధర :
ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G (12GB+256GB) ఫోన్ ధర రూ.91,749కి అందుబాటులో ఉంది. రూ.1,19,999 (శాంసంగ్ స్టోర్ ధర) నుంచి తగ్గింది. వినియోగదారులు (Amazon Pay) క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ధరను రూ.2,752 వరకు తగ్గించవచ్చు.
వినియోగదారులు నెలకు రూ.4,448 నుంచి ప్రారంభమయ్యే EMI కూడా ఎంచుకోవచ్చు. కొనుగోలుదారులు ఉపయోగించే బ్యాంక్ కార్డుల ఆధారంగా నో-కాస్ట్ EMI కూడా ఎంచుకోవచ్చు. మీ పాత ఫోన్‌తో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. వర్క్ కండిషన్ మోడల్ ఆధారంగా రూ.22,800 వరకు తగ్గింపు పొందవచ్చు. కస్టమర్లు యాడ్-ఆన్ కోసం శాంసంగ్ కేర్ ప్లస్ అక్సిడెంటల్, లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్, టోటల్ ప్రొటెక్షన్ ప్లాన్ కూడా పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 6.8-అంగుళాల QHD+ అమోల్డ్ డిస్‌ప్లేతో అమర్చి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది. 12GB వరకు (LPDDR5X) RAMతో స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
200MP మెయిన్ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో సెన్సార్, 12MP అల్ట్రావైడ్ యూనిట్‌తో సహా క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 12MP కెమెరాను కలిగి ఉంది.
Read Also : WhatsApp Status : వాట్సాప్ స్టేటస్‌లో కూడా లొకేషన్ షేర్ చేయొచ్చు తెలుసా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!
సర్కిల్ టు సెర్చ్, నోట్ అసిస్ట్ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ప్రకారం.. ఏప్రిల్ 7న ఆండ్రాయిడ్ 15-ఆధారిత వన్ UI7 అప్‌డేట్ పొందుతుంది. ఈ అప్‌డేట్‌తో వినియోగదారులు కొత్త ఏఐ ఫీచర్లను పొందవచ్చు.