Big Boss 7
Singing Audition with Sreemukhi in BB7 Telugu: బిగ్ బాస్ 7 సీజన్ చివరి దశలో ఉంది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సీజన్ సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోయింది. డిసెంబర్ 17 న గ్రాండ్ ఫినాలేకి రెడీ అవుతున్న సమయంలో యాంకర్ శ్రీముఖి హౌస్‌లోకి వెళ్లింది. ప్రశాంత్‌కి హగ్ ఇస్తానంది. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ 7 సీజన్ మరికొన్ని గంటల్లో గ్రాండ్ ఫినాలే జరుపుకోబోతోంది. డిసెంబర్ 17న ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోతుంది. ఈ ఏడాది హౌస్‌లోకి వచ్చిన 19 మంది కంటెస్టెంట్స్‌లో శివాజీ, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్‌లు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ నుండి కొత్తగా ఓ ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో యాంకర్ శ్రీముఖి సందడి చేస్తూ కనిపించింది.
బిగ్ బాస్ 7 సీజన్ పూర్తైన నెక్ట్స్ వీక్ ‘సూపర్ సింగర్’ కార్యక్రమం ఉంటుందని హౌస్‌లో శ్రీముఖి అనౌన్స్ చేసింది. కంటెస్టెంట్స్‌కి సరదాగా సింగింగ్ ఆడిషన్ పెట్టింది. ప్రశాంత్‌ని ఉద్దేశించి ‘ఇది ఫన్ టాస్క్.. ఓడిపోతే హగ్గిస్తా.. గెలిస్తే గట్టి హగ్గిస్తా.. ఓకే’ అనడంతో ప్రశాంత్ నవ్వుతూ మెలికలు తిరిగిపోయాడు. శ్రీముఖి పెట్టిన ఆడిషన్‌లో అమర్‌దీప్ ‘గోంగూర తోటకాడ’ అంటూ పాటందుకుని లిరిక్స్ మర్చిపోయాడు.. అంబటి అర్జున్ ‘కెవ్ కేక’ పాట పాడి అందరిని నవ్వించాడు. ఈ టాస్క్ తర్వాత శ్రీముఖి ట్రూత్ ఆర్ డేర్ ఆడించింది. ముగ్గురి నుంచి ఒకరితో డేట్, ఒకరిని కిల్, ఒకరిని మ్యారీ అంటే ఎలా సెలక్ట్ చేసుకుంటావ్? అని శ్రీముఖి అడిగిన ప్రశ్నకు ప్రిన్స్ యావర్ అశ్వినిని పెళ్లి చేసుకుంటానని అందరికీ షాక్ ఇచ్చాడు.. శ్రీముఖి రాకతో బిగ్ బాస్ హౌస్ సందడిగా మారిపోయింది.
Year End Roundup 2023 : 2023 లో టాలీవుడ్‌కి కలిసిరాని రీమేక్‌లు
డిసెంబర్ 17 న జరగబోతున్న గ్రాండ్ ఫినాలే కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది బిగ్ బాస్ టీమ్. ఫినాలేలో మాజీ కంటెస్టెంట్లు కూడా పార్టిసిపేట్ చేసి డ్యాన్సులతో అలరించబోతున్నట్లు సమాచారం. గ్రాండ్ ఫినాలేకి మహేష్ బాబు వస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్, రన్నర్‌ను ప్రకటించబోయే గ్రాండ్ ఫినాలేపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.