Nikhil Siddhartha : సలార్ సినిమాకి 100 టికెట్లు ఫ్రీగా ఇస్తున్న నిఖిల్.. అది కూడా అర్ధరాత్రి బెనిఫిట్ షోకి..

సలార్ సినిమాకి ప్రమోషన్స్ కూడా చేయకపోవడం గమనార్హం. సినిమా రిలీజ్ ఇంకో ఆరు రోజుల్లో పెట్టుకొని ఇప్పటికి కూడా ఇంకా తెలుగులో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు.

Nikhil Siddhartha : సలార్ సినిమాకి 100 టికెట్లు ఫ్రీగా ఇస్తున్న నిఖిల్.. అది కూడా అర్ధరాత్రి బెనిఫిట్ షోకి..

Nikhil Siddhartha Offer 100 Free Salaar Movie Tickets to Prabhas Fans

Updated On : December 16, 2023 / 2:42 PM IST

Nikhil Siddhartha : ప్రభాస్(Prabhas) సలార్(Salaar) సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమాతో పెద్ద హిట్ కొడతాడని ఎదురుచూస్తున్నారు.

సలార్ సినిమాకి ప్రమోషన్స్ కూడా చేయకపోవడం గమనార్హం. సినిమా రిలీజ్ ఇంకో ఆరు రోజుల్లో పెట్టుకొని ఇప్పటికి కూడా ఇంకా తెలుగులో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. బెనిఫిట్ షోలు, తెల్లవారుజామున షోలు ఉంటాయని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా హీరో నిఖిల్ ప్రభాస్ అభిమానులకు ఓ హ్యాపీ న్యూస్ తెలిపాడు.

Also Read : Boby Deol : యానిమల్ సినిమాలో హీరోకి – విలన్‌కి మధ్య కిస్ సీన్ పెట్టిన సందీప్ వంగ.. కానీ ఎడిటింగ్‌లో..

నిఖిల్ తన ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశాడు. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ కోసం హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్లో డిసెంబర్ 21 అర్ధరాత్రి ఒంటి గంటకు సలార్ షో పడుతుందని క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఈ షోకి 100 మంది డై హార్డ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫ్రీగా టికెట్స్ ఇస్తానని, వారితో కలిసి నేను కూడా సినిమా చూస్తానని చెప్పాడు. 10 ఏళ్ళ క్రితం అదే థియేటర్లో రాత్రి ఒంటిగంటకు రిలీజ్ రోజు మిర్చి సినిమా చూశాను, ఇప్పుడు హిస్టరీ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్. దీంతో నిఖిల్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. మరి నిఖిల్ దగ్గర్నుంచి ఫ్రీగా సలార్ సినిమా టికెట్స్ సంపాదించే అదృష్టవంతులు ఎవరో.