Year End Roundup 2023 : 2023 లో టాలీవుడ్‌కి కలిసిరాని రీమేక్‌లు

2023 టాలీవుడ్ రీమేక్‌లు అనుకున్న అంచనాలను అందుకోలేకపోయాయి. అసలు కథలో చేసిన మార్పులు చేర్పులు కావచ్చు.. ఇతర కారణాలతో అభిమానులను నిరాశపరిచాయి.

Year End Roundup 2023 : 2023 లో టాలీవుడ్‌కి కలిసిరాని రీమేక్‌లు

Year End Roundup 2023

Telugu Remake Movies : 2023 లో టాలీవుడ్‌లో విడుదలైన రీమేక్ సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. స్టార్ హీరోలు చేసిన రీమేక్‌లు సైతం థియేటర్లలో చతికిలపడ్డాయి. రీమేక్ వెంచర్స్ ఈ ఏడాది టాలీవుడ్‌కి అస్సలు కలిసి రాలేదని చెప్పాలి.

ఈ ఏడాది విడులైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ‘బ్రో’ సక్సెస్ కాలేకపోయింది. సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘వినోదాయ సిత్తం’ అక్కడి ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. దర్శకుడు సముద్రఖని కాలం పాత్రలో కనిపించారు. ఇదే సినిమాని తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. అయితే అసలు కథకు త్రివిక్రమ్ మార్పులు చేసారంటూ విమర్శలు వచ్చాయి. అందుకే అనుకున్నట్లుగా రాలేదని చర్చ జరిగింది. జస్ట్ 20 రోజుల్లో హడావిడిగా పూర్తి చేసిన బ్రో సినిమా పెద్దగా ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేకపోయింది. పవన్ అభిమానులను తీవ్ర నిరాశపరిచింది.

#MayaLo Review : #మాయలో రివ్యూ.. ప్రేమ, స్నేహంలో రొమాంటిక్ కామెడీతో..

మాస్ మహరాజా రవితేజ నటించిన ‘రావణాసుర’ కూడా జనాలకు రీచ్ కాలేకపోయింది. బెంగాలీ థ్రిల్లర్ ‘విన్సీ డా’ కి రీమేక్‌గా ఈ సినిమాని తీసారు. అయితే ఒరిజినల్ సినిమాలోని మెయిన్ పాయింట్ మాత్రమే తీసుకుని మిగిలిన స్టోరీ అంతా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్‌లో మార్చేసారు. దీంతో కథ, కథనం పూర్తిగా దెబ్బతిన్నాయి. మరీ ముఖ్యంగా రవితేజ వంటి స్టార్‌తో తీస్తున్న సినిమాగా ఈ సినిమా ట్రీట్మెంట్ లేదని చెప్పాలి.

మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భోళా శంకర్’ అభిమానులను నిరాశపరిచింది. ఈ సినిమా 2015 లో వచ్చిన తమిళ సినిమా ‘వేదాళం’కి రీమేక్. ఈ సినిమా వచ్చి పదేళ్లు అవుతోంది. స్క్రిప్ట్ పాతదే అయినా దానికి అదనపు హంగులు చేర్చడంలో మెహర్ రమేష్ విఫలమయ్యారని చెప్పాలి. అసలు వేదాళంని రీమేక్ చేయవద్దని చాలామంది సలహా ఇచ్చారట. ఏది ఏమైనా అంచనాలు అందుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమైందని చెప్పాలి.

Aishwarya Rai : బచ్చన్ ఫ్యామిలీ నుండి ఐశ్వర్య వేరు పడటం నిజమేనా ?

మరాఠిలో సూపర్ హిట్ అయిన ‘నట సామ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తండ; పేరుతో రీమేక్ చేశారు దర్శకుడు కృష్ణవంశీ. కమర్షియల్‌గా అంతగా పేరు తెచ్చుకోలేకపోయినా పాజిటివ్ రివ్యూలతో కాస్త ఫర్వాలేదనిపించింది. మొత్తానికి 2023 భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో రీమేక్స్ చేసిన టాలీవుడ్ భారీ నష్టాలను చవి చూసింది. 2023 అనుభవాలను దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ డైరెక్టర్స్ రీమేక్స్‌పై కాస్త జాగ్రత్త పడాల్సిందే.