Aishwarya Rai : బచ్చన్ ఫ్యామిలీ నుండి ఐశ్వర్య వేరు పడటం నిజమేనా ?
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ నుండి విడిపోయి ఐశ్వర్య-అభిషేక్ వేరు కాపురం పెడుతున్నారా? సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజమెంత?

Aishwarya Rai
Aishwarya Rai : మొన్నటి వరకు బాలీవుడ్ కపుల్ ఐశ్వర్య-అభిషేక్ జంట విడిపోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ జంట బచ్చన్ కుటుంబం నుండి వేరుపడినట్లు వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజమెంత?
బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య-అభిషేక్ విడిపోతున్నారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీనిపై తీవ్ర చర్చ జరిగింది. వారిద్దరు విడిపోతే వారి బిడ్డ ఆరాధ్య పరిస్థితి ఏంటని చాలామంది ఆందోళన పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఐశ్వర్య తన తల్లితో, బచ్చన్ ఫ్యామిలీతో ఉంటూ కనిపించారు. అయితే ఇటీవల బచ్చన్ ఫ్యామిలీలో కొన్ని విషయాలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఐశ్వర్య తన భర్తతో పాటు అత్తమామల నుండి పూర్తిగా విడిపోయి వేరు కాపురం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
కొంతకాలంగా ఐశ్వర్య, ఆమె అత్త జయాబచ్చన్ ఎక్కడా కలిసి కనిపించిన దాఖలాలు లేవు. అసలు వాళ్లిద్దరి మధ్య కొంతకాలంగా మాటలే లేవని తెలుస్తోంది. ఈ అత్తాకోడళ్ల మధ్య వైరం కారణంగా అభిషేక్ చాలాకాలంగా అటు తల్లిదండ్రులు, ఇటు భార్య మధ్య నలిగిపోతూ వచ్చారని తెలుస్తోంది. ఇటీవలే అమితాబ్ కూతురు శ్వేత జల్సా బంగ్లాలోకి షిఫ్ట్ కావడం కూడా ఐశ్వర్య అత్తమామల మధ్య మరింత వైరానికి కారణం అయ్యిందని తెలుస్తోంది.
Prabhas Maruthi : ప్రభాస్ మారుతీ సినిమాలో తమిళ్ స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా?
పరువు, మర్యాదలకు విలువనిచ్చే బచ్చన్ ఫ్యామిలీ నుండి ఐశ్వర్య విడిపోయే అవకాశం లేదు. అయితే బచ్చన్ ఫ్యామిలీ నుండి ఐశ్వర్యకు దూరం పెరగడం మాత్రం ఆమె స్నేహితులు,శ్రేయోభిలాషులను ఆందోళనలో పడేసింది. ఇందులో వాస్తవమెంతో భవిష్యత్తులో తెలియాలి.