Chisinau Airport: మాల్దోవన దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోరమైన కాల్పులు జరిగిన రెండు వారాల అనంతరం ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి సహా మరో ఇద్దరు మంత్రుల రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాను ఆ ప్రధాన మంత్రి డోరిన్ రీసీన్ శుక్రవారం ఆమోదించారు. ఒక సందర్భంలో విలేకరులతో ప్రధాని మాట్లాడుతూ ప్రభుత్వంలో పనిచేసినందుకు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే వారు ఎందుకు రాజీనామా చేశారనే విషయాన్ని చెప్పలేదు.
Rashmika : బేబీ ప్రీమియర్.. హాజరైన విజయ్ దేవరకొండ, రష్మిక.. శ్రీవల్లి రియాక్షన్ ఇదే
జూన్ 30న చిసినావు విమానాశ్రయంలో జరిగిన కాల్పుల ఘటనపై అంతర్గత మంత్రి అన రెవెన్‌కో రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ మంత్రి అనటోలీ తోపాల్.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ రీజినల్ డెవలప్‌మెంట్ మంత్రి లిలియా దబిజాతో కలిసి ఆమె రాజీనామా చేశారు.
ఇస్తాంబుల్ నుంచి వచ్చిన 43 ఏళ్ల తాజిక్ వ్యక్తికి మోల్డోవాకు ప్రవేశం నిరాకరించడంతో ఇష్టారీతిన కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా అధికారులు చనిపోయారు. ఒక పౌరుడు గాయపడ్డాడు. విమానాశ్రయంలో జరిగిన కాల్పుల్లో గాయపడిన తజిక్ వ్యక్తి తరువాత మరణించినట్లు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి.