JelenZelensky scy
Ukraine war: ప్యారిస్ లో జరిగే 2024 ఒలింపిక్స్ లో రష్యా అథ్లెట్లు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వకూడదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2024 ఒలింపిక్స్ గురించి జెలెన్ స్కీ మాట్లాడుతూ… ఆ క్రీడల్లో రష్యా పాల్గొనేందుకు అనుమతి ఇస్తే దుందుడుకు చర్యలను అంగీకరించినట్లేనని చెప్పారు.
ఈ అంశాన్ని తాను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వద్ద కూడా లేవనెత్తినట్లు జెలెన్ స్కీ తెలిపారు. బెలారస్, రష్యా క్రీడాకారులు ఒలింపిక్స్ గేమ్స్ లో తటస్థంగా పాల్గొనవచ్చని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటన చేసిన నేపథ్యంలో జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రష్యా, బెలాసర్ క్రీడాకారులకు ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం ఇస్తే తాము 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ను బహిష్కరిస్తామని ఉక్రెయిన్ తెలిపింది.
దుందుడుకు చర్యలను సమర్థిస్తున్నామనేలా ఐఏసీ ప్రయత్నాలు ఉన్నాయని, రష్యా అథ్లెట్లను ఒలింపిక్ గేమ్స్ లోని మళ్ళీ తీసుకురావాలని ప్రయత్నాలు జరుపుతున్నారని జెలెన్ స్కీ మండిపడ్డారు. నియంతలు నాజీలు జర్మనీలో అధికారంలో ఉన్న సమయంలో 1936లో బెర్లిన్ లో జరిగిన ఒలింపిక్స్ ను వచ్చే ఏడాది ప్యారిస్ తో జరగనున్న ఒలింపిక్ గేమ్స్ తో జెలెన్ స్కీ పోల్చారు. పెద్ద పొరపాటు జరిగేందుకు తావు ఇవ్వకూడదని, గీత దాటి ప్రవర్తించకూడదని అన్నారు.
Elon Musk: నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఎలన్ మస్క్.. ఐదు కంపెనీల బాధ్యతలతో సతమతం