Elon Musk: నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఎలన్ మస్క్.. ఐదు కంపెనీల బాధ్యతలతో సతమతం

ట్విట్టర్ కోసం రోజుకు 18 గంటలపాటు పని చేస్తున్నట్లు గతంలో మస్క్ వెల్లడించాడు. అయితే, మస్క్‌కు మరో నాలుగు కంపెనీలున్నాయి. ప్రధాన కంపెనీ టెస్లాతోపాటు, ద బోరింగ్ కంపెనీ, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ అనే మరో నాలుగు కంపెనీలకు మస్క్ అధినేత.

Elon Musk: నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఎలన్ మస్క్.. ఐదు కంపెనీల బాధ్యతలతో సతమతం

Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకడిగా ఉన్న ఎలన్ మస్క్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. అధిక పని భారం వల్ల మస్క్ తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఎలన్ మస్క్ గతేడాది ట్విట్టర్ సంస్థను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Budget Session: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న ప్రభుత్వం

దీంతో ఈ సంస్థను మరింత వృద్ధిలోకి తెచ్చేందుకు మస్క్ నిరంతరం శ్రమిస్తున్నాడు. ట్విట్టర్ కోసం రోజుకు 18 గంటలపాటు పని చేస్తున్నట్లు గతంలో మస్క్ వెల్లడించాడు. అయితే, మస్క్‌కు మరో నాలుగు కంపెనీలున్నాయి. ప్రధాన కంపెనీ టెస్లాతోపాటు, ద బోరింగ్ కంపెనీ, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ అనే మరో నాలుగు కంపెనీలకు మస్క్ అధినేత. దీంతో వీటి నిర్వహణా బాధ్యతల్ని కూడా మస్క్ చూసుకోవాల్సి వస్తోంది. ఐదు కంపెనీల బాధ్యతలతో మస్క్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. అన్ని కంపెనీల్లోకి ప్రస్తుతం ట్విట్టర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ కంపెనీ ఇప్పుడు నష్టాల్లో ఉంది.

Australia: ఖలిస్తాన్ మద్దతుదారుల అరాచకం.. ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడి

అందుకే నిరంతరం శ్రమిస్తూ, కీలక మార్పులు తెస్తూ కంపెనీని లాభాల్లోకి నడిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ట్విట్టర్ కంపెనీని సొంతం చేసుకున్న మస్క్ కంపెనీలో అనేక మార్పులు తెస్తున్నాడు. 50 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించుకున్నాడు. అమెరికాతోపాటు ఇండియా, ఇతర దేశాల్లోనూ ఉద్యోగుల్ని తొలగించాడు. ప్రస్తుతం ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 2,300 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇండియాకు సంబంధించి కంపెనీ 170 మంది సిబ్బందిని తొలగించింది. 80 మంది వరకు మాత్రమే కీలకంగా పని చేస్తున్నారు. ట్విట్టర్ ఉద్యోగులతో ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్నాడు.

Hockey World Cup 2023: పురుషుల హాకీ ప్రపంచ కప్ విజేత జర్మనీ.. ఫైనల్‌లో బెల్జియంపై గెలుపు

అలా చేయడం ఇష్టంలేని వాళ్లు కంపెనీ వదిలి వెళ్లిపోవచ్చని కూడా ఆదేశించాడు. ఆఫీసుల్లో ఉద్యోగులు విశ్రాంతి తీసుకునేందుకు కొన్ని చోట్ల బెడ్స్ కూడా ఏర్పాటు చేశాడు. కంపెనీ నిర్వహణా వ్యయాల్ని వీలైనంత తగ్గించుకోవాలని మస్క్ చూస్తున్నాడు. చివరకు కంపెనీలోని ఫర్నీచర్ కూడా అమ్మేస్తున్నాడంటే మస్క్ నిర్ణయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.