ఏపీలో నాలుగేళ్లలో గణనీయమైన అభివృద్ధి : గవర్నర్ నరసింహన్
విజయవాడలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

విజయవాడలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
విజయవాడ : విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర్య సమరయోధులు, విద్యార్థులు, నగర ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగించారు. ఏపీలో నాలుగేళ్లలో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు.
ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. సాంకేతికను జోడించి అభివృద్ధి వైపు రాష్ట్రం పయనిస్తోందన్నారు. రాష్ట్ర విభజనతో ఎదురైన కష్టాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. విద్యుత్ కొరతను అధిగమిస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత నీటిని అందించగలుతున్నామని చెప్పారు.
అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆరోగ్య కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పాలన సులభతరమన్నారు. పోలవరం నిర్మాణాన్ని ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగులకు భృతి ఇస్తున్నామని తెలిపారు.