మారుతీరావు అంత్యక్రియల్లో ఉద్రిక్తత..అమృతా రావద్దు..ఆయన ఆత్మ శాంతించదు

  • Published By: veegamteam ,Published On : March 9, 2020 / 07:00 AM IST
మారుతీరావు అంత్యక్రియల్లో ఉద్రిక్తత..అమృతా రావద్దు..ఆయన ఆత్మ శాంతించదు

Updated On : March 9, 2020 / 7:00 AM IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటిలో జరుగుతున్న అంత్యక్రియల కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తండ్రి మారుతీరావును చివరి చూపు చూడటానికి వచ్చి అమృతను బంధువులు అడ్డుకున్నారు. అమృతా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కానీ పోలీసు బందోబస్తుతో వచ్చిన అమృత తండ్రి భౌతిక కాయాన్ని చూసి వెళ్లిపోయింది. 

అమృత తండ్రి భౌతికకాయాన్ని చూడటానికి వస్తుందా? రాదా? అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ అమృత ఎలాగైనా తండ్రి భౌతిక కాయాన్ని చూడటానికి వస్తుందని బంధువులంతా ముందే ఊహించారు. వారు ఊహించినట్లుగానే అమృత వచ్చింది. పోలీసు బందోబస్తుతో వచ్చింది. తండ్రి భౌతిక కాయం ఉన్న ఘాట్ వద్దకు చేరుకునే క్రమంలో బంధువుల ఒప్పుకోలేదు. ‘‘అమృతా గోబ్యాక్’’ఆయన చావుకు నువ్వే కారణం..నవ్వు వస్తే ఆయన ఆత్మశాంతించదు’’ అంటూ నినాదాలు చేశారు.

దీంతో కొన్ని అడుగుల దూరం నుంచి తండ్రిని చూసి వెళ్లిపోయింది.  అసలు అమృత రాకుండానే అంత్యక్రియల్ని పూర్తిచేయాలని బంధువులు ఎంతగానో యత్నించారు. కానీ అమతమాత్రం తండ్రి భౌతికకాయాన్ని చూడకుండా ఆపలేకపోయారు. వాళ్లు ఎంతగా అడ్డుకున్నా..దూరంగా నుంచే చూసి వెళ్లిపోయింది. ఉద్రిక్తతల మధ్య మారుతీరావు అంత్యక్రయలు పూర్తయ్యాయి. మారుతీరావు తమ్ముడు శ్రవణ్ మారుతీరావు చితికి నిప్పు అంటించి కార్యక్రమాన్ని పూర్తిచేశారు. (మారుతీరావు అంత్యక్రియలు : అమృత వస్తుందా..పోలీసుల భారీ బందోబస్తు)

నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన కూతురు అమృత వర్షిణి కులాంతర వివాహాన్ని తట్టుకోలేకపోయాడు. 2018 సెప్టెంబర్‌ 14న జరిగిన అమృత భర్త ప్రణయ్‌ హత్యకేసులో మారుతీరావు నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఇటీవల ఈ కేసు కోర్టులో ట్రయల్‌కు వచ్చింది. ప్రణయ్‌ హత్యానంతరం బంధువులతో మనస్పర్థలు.. సుపారీ గ్యాంగ్‌ ఒత్తిడితో కుంగిపోయిన మారుతీరావు శనివారం రాత్రి హైదరాబాద్‌లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

ప్రణయ్‌ హత్య కేసుకు సంబంధించి న్యాయవాదిని కలిసేందుకు శనివారం హైదరాబాద్‌కు వచ్చిన మారుతీరావు ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్యభవన్‌లో 306 సూట్‌ను అద్దెకు తీసుకున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో కారు డ్రైవర్‌ రాజేశ్‌తో కలిసి ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ వద్ద గారెలు తెచ్చుకున్నాడు. రాజేశ్‌ను కారులోనే నిద్రించాలని చెప్పి, తాను గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఆదివారం ఉద యం 6 గంటలకు రాజేశ్‌ వెళ్లి తలుపు తట్టగా మారుతీరావు నుంచి సమాధానం రాలేదు. ఉదయం 7.30 గంటలకు మరోసారి పిలిచా డు. స్పందనలేకపోవడంతో మారుతీరావు భార్య గిరిజకు, పోలీసులకు సమాచారమిచ్చా డు. అక్కడికి చేరుకొన్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా.. మంచంమీద విగతజీవిగా కనిపించాడు. బెడ్‌పై సెల్‌ఫోన్‌, దవాఖానకు సంబంధించిన ప్రిస్కిప్షన్‌, కారు పత్రాలతోపాటు ‘గిరిజా క్షమించు.. అమృతా, అమ్మ దగ్గరకు రా..’ అని రాసి ఉన్న సూసైడ్‌ నోట్‌ లభించింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. 

See Also | ఇలాంటి శానిటైజర్లు కరోనా వైరస్‌ నుంచి కాపాడలేవు!