ఏపీ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ

ఏపీ ఆర్టీసీ కార్మికులను ప్రజా రవాణాశాఖలో విలీనంచేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్టీసీలోని 53వేల మది కార్మికులను రేపటి (జనవరి1,2020) నుంచి ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ఆర్టీసీ అధికారులకు హోదాలు మారనున్నాయి. ఆర్టీసీ వీసీ, ఎండీకి పీటీడీ కమిషనర్, డైరెక్టర్ హోదా రానుంది. ఈడీలకు అడిషనల్ కమిషనర్లు, ఆర్ఎంలకు జాయంట్ కమిషనర్ల హోదా రానుంది. అలాగే డిపో మేనేజర్లకు అసిస్టెంట్ కమిషనర్ల హోదా రానుంది.
కాగా..ఏపీ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుకు శాసన సభ ఆమోదం పలికిన విషయం తెలిసిందే. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రంగ సంస్థల్లో పనిచేసేవారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోరాదంటూ 1997లో చేసిన చట్టానికి సవరణ చ ేస్తూ ఆర్టీసీ ఉద్యోగులను తీసుకునేలా ఈ చట్టం తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. ఆర్టీసీలో పనిచేస్తున్న 53 వేలమంది ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రజారవాణాశాఖలో ఉద్యోగులు కానున్నారు.