అమరావతిలో 144 సెక్షన్ అమలుపై హైకోర్టు ఆగ్రహం 

  • Published By: veegamteam ,Published On : January 13, 2020 / 10:46 AM IST
అమరావతిలో 144 సెక్షన్ అమలుపై హైకోర్టు ఆగ్రహం 

Updated On : January 13, 2020 / 10:46 AM IST

అమరావతి గ్రామాల్లో ప్రభుత్వం 144 సెక్షన్..పోలీస్ యాక్ట్ 30 అమలుపై విధించటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కేసును సుమోటాగా స్వీకరించిన హైక్టోర్టు  అమరావతి గ్రామాల్లో ప్రభుత్వం 144 సెక్షన్..పోలీస్ యాక్ట్ అమలుపై పలు దృశ్యాలను పరిశీలించిన హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. 
రాజధాని తరలింపు అంశంపై తాము శాంతియుతంగా నిరసన వ్యక్తంచేయటానికి అనుమతి ఇవ్వటంలేదని తమ ఆవేదన వ్యక్తంచేయటానికి కూడా స్వేచ్ఛ లేకుండా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు ప్రజలపై నిరకుశత్వంగా దాడికి పాల్పడుతున్నారని కొంతమంది వాపోతూ కొంతమంది పిటీషన్ వేసారు. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలను. దృశ్యాలను హైకోర్టుకు సమర్పించారు. వాటిని పరిశీలించిన న్యాయస్థానం…దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అనంతరం ఈ అంశంపై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.  

మూడు రాజుధానులు ఉండొచ్చంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటనను నిరసిస్తూ.. 29 గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నిరాహారదీక్షలు చేస్తున్నారు.నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. రైతులు రిలే దీక్షలు..మహిళలు ధర్నాలు కొనసాగుతున్నాయి. అన్ని గ్రామాల్లో నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ర్యాలీ నిర్వహించే మహిళల్ని పోలీసులు ఇష్టానుసారంగా దుర్భాషలాడుతున్నారు.కొడుతున్నారు. అశ్లీల పదాలతో నానా దుర్భాషలాడుతున్నారు. అరెస్టులు చేస్తున్నారు. కనిపించినవారినల్లా లాఠీలతో కొడుతున్నారు. ఈడ్చి పడేస్తున్నారు.

ఈ క్రమంలో మహిళలకు..పోలీసులకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణలో చాలామంది మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి. కొంతమంది సొమ్మసిల్లిపడిపోతున్నారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు లాఠీలతో కొడుతూ..బూటుకాళ్లతో తన్నుతున్నారు. ఇలా అమరావతి గ్రామాల్లో శాంతియుతంగా చేస్తున్న ఆందోళనపైనా..ర్యాలీలు చేస్తున్న మహిళలపై పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. ఈ క్రమంలో అసలు అమరావతిలో 144 సెక్షన్ విధించటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనికి సంబంధంచి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.