APSRTC ఎండీ బదిలీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ ఆర్టీసీ) ఎండీ సురేంద్రబాబు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది.

  • Published By: veegamteam ,Published On : September 25, 2019 / 06:48 AM IST
APSRTC ఎండీ బదిలీ

Updated On : September 25, 2019 / 6:48 AM IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ ఆర్టీసీ) ఎండీ సురేంద్రబాబు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ ఆర్టీసీ) ఎండీ సురేంద్రబాబు బదిలీ అయ్యారు. ఆయన డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 2018 మార్చి నెలలో ఆర్టీసీ ఎండీగా సురేంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుకు ఆర్టీసీ ఎండీగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం (సెప్టెంబర్ 25, 2019) ప్రభుత్వం ఉత్తర్తులు జారీ చేసింది.

అలాగే చేనేత, జౌళి శాఖ కార్యదర్శి శ్రీనివాస శ్రీనరేష్‌ ను కూడా బదిలీ చేశారు. ఆయన సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి జె.మురళికి చేనేత, జౌళి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది.