బోటు వెలికితీత : గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు
కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. బోటులో గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి.

కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. బోటులో గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి.
ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 విజయవంతం అయ్యింది. ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. మంగళవారం(అక్టోబర్ 22, 2019) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ధర్మాడి టీమ్ బోటుని నీటి లోపలి నుంచి వెలికితీసింది. ప్రమాదం జరిగిన 38 రోజుల తర్వాత బోటు బయటపడింది. బోటులో నుంచి 5 మృతదేహాలు కూడా బయటపడ్డాయి. 38 రోజులుగా మృతదేహాలు బోటులోనే ఉన్నాయి. మిగతా మృతదేహాల కోసం గాలిస్తున్నారు.
బోటులో గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి. శవాలు పూర్తిగా కుళ్లిపోయి అవయవాలు బయటపడుతున్నాయి. మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాల నుంచి డీఎన్‌ఏ సేకరించి కుటుంబ సభ్యులతో పోల్చి మృతదేహాలను అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
(సెప్టెంబర్ 15, 2019) కచ్చులూరు దగ్గర బోటు ప్రమాదం జరిగింది. గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండలు వెళ్తుండగా బోటు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 77మంది టూరిస్టులు ఉన్నారు. ప్రమాదం నుంచి 26మంది సురక్షితంగా బయటపడ్డారు. బోటు ప్రమాదంలో ఇప్పటివరకు 44 మృతదేహాలు వెలికితీశారు. మరో 7 మృతదేహాల కోసం గాలిస్తున్నారు.