మోహన్ బాబు ఊసరవెల్లి : పారితోషికం ఎంత అందింది – బుద్ధా వెంకన్న

సినీ నటులు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఏపీలోని వైసీపీ పార్టీకి స్టార్స్ క్యూ కడుతున్నారు.

  • Published By: madhu ,Published On : April 1, 2019 / 08:55 AM IST
మోహన్ బాబు ఊసరవెల్లి : పారితోషికం ఎంత అందింది – బుద్ధా వెంకన్న

Updated On : April 1, 2019 / 8:55 AM IST

సినీ నటులు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఏపీలోని వైసీపీ పార్టీకి స్టార్స్ క్యూ కడుతున్నారు.

సినీ నటులు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఏపీలోని వైసీపీ పార్టీకి స్టార్స్ క్యూ కడుతున్నారు. టాలీవుడ్ డైలాగ్ కింగ్‌గా పేరు గడించిన ‘మోహన్ బాబు’ YSRCP కండువా కప్పుకుని ఏపీ సర్కార్.. బాబుపై విమర్శలు చేస్తున్నారు. దీనితో తెలుగు తమ్ముళ్లు ఆయనపై ఫైర్ అవుతున్నారు. బాబు పాలన భూ కబ్జాల మయం..అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 135 సీట్లు వస్తాయి..బాబుకు ఇవే చివరి ఎన్నికలు అంటూ మోహన్ బాబు కామెంట్స్ చేశారు. దీనిపై ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న తీవ్రంగా స్పందించారు. మోహన్ బాబుపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మోసకారి..ఎంత మందిని మోసం చేశారో…తన వద్ద లిస్టు ఉందంటూ వ్యాఖ్యానించారు. 
Read Also : జగన్ 135 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు : మోహన్ బాబు

ఏప్రిల్ 01వ తేదీ సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…నట ప్రపూర్ణ అని చెప్పుకునే మోహన్‌బాబు ఊసరవెల్లిలా ఎవరు ప్యాకేజీ ఇస్తే వారి గురించి మాట్లాడతారని ఆరోపించారు. చంద్రబాబుపై బురదజల్లేందుకు ఈ బాబుకి ఎంత పారితోషికం అందిందో చెప్పాలని నిలదీశారు. గురువు దాసరికి పంగనామాలు పెట్టిన వ్యక్తి ఇతను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బుద్ధా.

పారితోషకం ఇవ్వందే ఏమీ మాట్లాడరని సంచలన కామెంట్స్ చేశారు. మోహన్ బాబు ఉత్తముడని లక్ష్మీపార్వతితో స్టేట్‌మెంట్ ఇప్పిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బుద్ధా వెంకన్న సవాల్‌ విసిరారు. జగన్‌కు పెయిడ్ వర్కర్‌గా మారి చంద్రబాబును విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మోహన్ బాబు గురించి చెబితే ఓ చరిత్ర అని బుద్ధా వెంకన్న చెప్పారు. దీనిపై మోహన్ బాబు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. 
Read Also : మనకు మనమే పోటీ : ఢిల్లీని శాసిద్దాం – హరీష్