గుప్త నిధులంటు లక్షలు దోచేసిన దొంగబాబా

సూర్యాపేటలో మరో దొంగ బాబా కలకలం సృష్టించాడు. అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నాడు. మీ ఇంట్లో బంగారు రాశులు ఉన్నాయనీ..నమ్మిస్తున్నాడు. ఈ మాటలు నమ్మిన కొంతమంది దొంగబాబాకు అడిగినంత ఇచ్చేస్తున్నారు. దీంతో అందినకాడికి డబ్బులు దండుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ కుటుంబ సభ్యుల నుంచి ఏకం రూ.10 లక్షలు వసూలు చేశాడు. మీ ఇంట్లో బంగారు నాణాలు ఉన్నాయనీ అవి మీకు దక్కాలంటే పూజలు చేయాలన్నాడు. దానికి లక్షలు ఖర్చవుతాయన్నాడు. దీంతో ఆశపడిన వారు ఈ దొంగబాబాకు రూ.10 లక్షలు ముట్టచెప్పారు.పూజలు చేసిన అనంతరం వారికి కొన్ని నాణాలు ఇచ్చి జంప్ అయిపోయాడు.
కాగా..సింగతల వీరారెడ్డి అనే వ్యక్తి నివాసంలో బంగారు నాణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు గ్రామంలో ఇంకా ఇటువంటివేమన్నా జరుగుతున్నాయా? అనే కోణంలో ఆరా తీశారు.ఈ క్రమంలో ఏప్రిల్ 16వ తేదీ రాత్రి గుప్త నిధులు కోసం ఓ కుటుంబం తవ్వకాలు జరుపుతున్నారనే సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఓ ఇంటిపై రైడ్ చేశారు. వారి వద్ద నుంచి ఆ నాణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని కెమికల్స్ లో వేసిన పరీక్షించగా అవన్నీ రాగి, ఇత్తడి నాణాలుగా నిర్ధారణ అయ్యింది.
దీంతో ఆ కుటుంబ సభ్యులను పోలీసులు విచారించగా..సదరు నకిలీ బాబా విషయాన్ని తెలిపారు. బాబా మాయమాటలను నమ్మి రూ.10 లక్షలు ఇచ్చామని చెప్పారు. ఓ పక్క బంగారంపై ఆశతో లక్షలు పోగొట్టుకోవటం…పోలీస్ ల రైడింగ్ లతో బాబా బురిడీ కొట్టించంటం వంటి వరుస ఘటనతో వారు లబోదిబోమన్నారు. కాగా వారు చెప్పిన ఆధారాలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు నకిలీ బాబాను కనిపెట్టి అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇలా నకిలీ బాబా మాయలకు పోలీసులు బట్టబయలు చేశారు పోలీసులు.