ప్రపంచంలోనే యూనిక్ టెంపుల్ యాదాద్రి : సీఎం కేసీఆర్

నల్గొండ: 1100 ఎకరాల్లో టెంపుల్‌ సిటీ నిర్మాణం జరుగుతోందని, ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయ

  • Published By: veegamteam ,Published On : February 3, 2019 / 12:39 PM IST
ప్రపంచంలోనే యూనిక్ టెంపుల్ యాదాద్రి : సీఎం కేసీఆర్

Updated On : February 3, 2019 / 12:39 PM IST

నల్గొండ: 1100 ఎకరాల్లో టెంపుల్‌ సిటీ నిర్మాణం జరుగుతోందని, ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయ

నల్గొండ: 1100 ఎకరాల్లో టెంపుల్‌ సిటీ నిర్మాణం జరుగుతోందని, ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయ నిర్మాణం జరుగుతోందన్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి క్షేత్రాన్ని సంద‌ర్శించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం.. ఆలయ పునర్నిర్మాణ పనుల్ని పరిశీలించారు. ప్ర‌ధానాల‌యం, వ్ర‌త మంట‌పం, శివాల‌యం ప‌నుల పురోగ‌తిని అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. లక్ష్మీ న‌ర‌సింహ‌స్వామిని కేసీఆర్ ద‌ర్శించుకున్నారు.

 

యాదాద్రి క్షేత్రం సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైందని కేసీఆర్‌ ఆరోపించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఓ అద్భుత క్షేత్రంగా ఖ్యాతిగాంచిందన్నారు. యాదాద్రి ఆలయం దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటోందన్నారు. నిర్మాణ పనులు మరింత వేగవంతంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయం కోసం 173 ఎకరాల స్థలాన్ని సేకరించామని సీఎం చెప్పారు. నిత్యాన్నదాన సత్రం నిర్మాణానికి రూ.10కోట్లు విరాళాలు వచ్చాయని చెప్పారు. ఉత్తరభాగంలో ఆలయం కిందివైపు భూమిని సేకరించడం జరిగిందని, స్థల సేకరణకు రూ.70కోట్లు విడుదల చేస్తున్నామని, నిత్యాన్నదాన సత్రాలు, బస్‌స్టేషన్‌, ఇతర నిర్మాణాలు చేపడుతామని కేసీఆర్ చెప్పారు.

 

యదాద్రి ప్రపంచంలోనే యూనిక్‌ టెంపుల్ అని సీఎం అన్నారు‌. ఏడంతస్తుల గోపురం కూడా శిల్పాలతోనే కట్టామన్నారు. ఆలయాలు ఒక తరం నుంచి మరో తరానికి సంస్కృతిని, సంస్కారాన్ని అందిస్తాయని చెప్పారు. 250 ఎకరాల్లో 354 క్వార్టర్ల నిర్మాణం చేస్తామని, క్వార్టర్ల నిర్మాణానికి 43 మంది దాతలు ముందుకు వచ్చారని సీఎం చెప్పారు. 50 ఎకరాల్లో ప్రవచన మంటపం నిర్మిస్తామన్నారు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి 133 దేశాల నుంచి వైష్ణవ పండితులు వస్తారని సీఎం తెలిపారు. 15 రోజుల్లో చినజీయర్ స్వామితో కలిసి మళ్లీ యాదాద్రికి వస్తానని సీఎం చెప్పారు.