మెకానిక్ రంగంలో దూసుకుపోతున్న విద్యా నంబిరాజన్.

సమాజంలో కొన్ని పనులలో మహిళలనే చూస్తుంటాం. అలాగే మరి కొన్ని పనులు పురుషులే నిర్వర్తిస్తుంటారు. అందుకు అనేక కారణాలు కనిపిస్తుంటాయి. ఒకవైపు మహిళలు అంతరిక్షంలో అడుగుపెడుతున్నప్పటికీ మరి కొన్ని రంగాలలో వారి ప్రవేశం అరుదుగానే ఉంటోంది. అలా మహిళలు అరుదుగా రాణించే రంగమైన మెకానిజంలో అడుగుపెట్టి అందులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న వనిత విద్యా నంబిరాజన్. మహిళలు అరుదుగా రాణించే రంగంలో ప్రవేశించటం ఒకింత సాధ్యమే అయినప్పటికీ దీర్ఘకాలం పాటు కొనసాగించటం కష్టసాధ్యమే. అలాంటి కష్టాన్ని ఇష్టంగా మలుచుకుని ఎంచుకున్న వృత్తికి కొత్త వన్నెలద్దుతున్న విద్యానంబిరాజన్ ఎంతో మంది మహిళలకు స్పూర్తిదాయకం. పూర్తి వివరాలను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..