దీపావళి స్పెషల్ : గిఫ్ట్ లు ఇవ్వటం ఆనవాయితీనా!

దీపావళికి మీరిచ్చే బహుమతి కలకాలం గుర్తుండిపోయేలా ఉండాలంటే అది ఎంతో ప్రత్యేకంగా ఉండాలి. దీపావళి వేళ ఆత్మీయులు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడమనేది భారతీయ సంప్రదాయం. పర్యావరణ హితమైన మట్టి ప్రమిదల్ని తయారు చేసి ఇవ్వొచ్చు. లేదంటే కొని ఇవ్వొచ్చు. దీపావళికి డ్రైఫ్రూట్స్ గిఫ్టులుగా ఇవ్వటం ఏనాటి నుంచో ఉంది.
ఈ-కామర్స్ వెబ్ సైట్లలో సైతం డ్రైఫ్రూట్స్ గిఫ్ట్ ప్యాక్స్ ఆకట్టుకుంటున్నాయి. మనం ఎవరికైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటామో వారు వృత్తులను బట్టి, అభిరుచులకు అనుగుణంగా గిఫ్ట్ లు ఇచ్చేలా అందుబాటులో ఉంటున్నాయి. స్వీట్స్, టపాసులు, ఆభరణాలు, క్యాండిల్స్, కేక్స్ బహుమతిగా ఇవ్వొచ్చు. ఇప్పుడు మార్కెట్ లో ఎన్నో రకాల డిజైన్లతో అందమైన క్యాండిల్స్ దొరుకుతున్నాయి. వాటిని గిఫ్ట్ గా ఇస్తే తీసుకున్నవారు కూడా ఎంతో సంతోషిస్తారు.
పర్యావరణాన్ని పరిరక్షించటంలో ముఖ్యపాత్ర వహిస్తూ మానవాళికి ప్రాణవాయువు (ఆక్సిజన్)ని అందించే మొక్కల్ని బహుమతిగా ఇవ్వటం కూడా ఆనవాయితీగా వస్తోంది. పర్యావరణానికి హానికలిగించని క్రాకర్స్ ను ఇంట్లోనే తయారు చేసుకుని ఇవ్వవచ్చు. పూర్వం క్రాకర్స్ ను ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్లంట. స్వయంగా తయారు చేసిన చిచ్చుబుడ్డులు, కాకరపువ్వొత్తులు, మతాబులు, సిసింద్రీలు వంటివి ఇంట్లోనే తయారు చేసి గిఫ్ట్ గా ఇచ్చేవారంట గతంలో.
వినూత్నంగా ఉండాలంటే కలర్ ఫుల్ పేపర్స్ తో చక్కగా బొమ్మలు తయారు చేసి ఇవ్వొచ్చు. డ్రైఫ్రూట్స్ పెట్టి ఇవ్వటానికి చక్కగా బుట్టలు తయారు చేసి ఇవ్వవచ్చు. వాల్ పెయటింగ్స్, దేవుడు ఫొటోలు, బొమ్మలు, ఇంట్లో హ్యాంగ్ చేసుకోవటానికి మార్కెట్ లో ఎన్నో రకాల ఐటెమ్స్ వస్తున్నాయి. వాటిని గిఫ్ట్ లుగా ఇవ్వవచ్చు. వేస్ట్ మెటీరియల్ తో తయారు చేసిన ఐటెమ్స్ ను ఇవ్వొచ్చు. చక్కటి గిఫ్టులను మీ ఆత్మీయులకు ఇవ్వండి వెలుగుల దీపావళిని సంతోషంగా ఆస్వాదించండి. కానీ గిఫ్టులు ఆనవాయితీగా వస్తోంది అనీ..లేని పోని ఇబ్బందులు మాత్రం తెచ్చుకోవద్దు. బహుమతులు ఇచ్చి పుచ్చుకోవటం అనేది ఆత్మీయతను పెంచాలి తప్ప తప్పనిసరి కాకూడదు. వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి సానుకూలతను బట్టి చేసుకోవాలి.