వనపర్తిలో కుటుంబం ఆత్మహత్యయత్నం : తండ్రీ, కూతురు మృతి  

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 07:23 AM IST
వనపర్తిలో కుటుంబం ఆత్మహత్యయత్నం : తండ్రీ, కూతురు మృతి  

Updated On : January 2, 2020 / 7:23 AM IST

ఒకే కటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు. తల్ల్లి, తండ్రి, కూతురు ముగ్గురూ పెట్రోల్‌ పేసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో తండ్రీ కూతురు మృతి చెందారు. తల్లి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. 

చిన్నంబావి మండలం..అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన బడికల జయన్న తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఈ  క్రమంలో జయన్న..భార్య వరలక్ష్మి, కూతురు గాయత్రి బుధవారం రాత్రి 10 గంటలకు తమ ఇంట్లో పెట్రోల్‌ పోసుకొని నిప్పంట్టించుకున్నారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి కొల్లాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వెంటనే ప్రాథమిక చికిత్స చేసి..పరిస్థితి విషమంగా ఉందనీ.. మెరుగైన వైద్యం కోసం  మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ జయన్న(40), ఆయన కూతురు గాయత్రి(17) మరణించారు. జయన్న భార్య వరలక్ష్మీ విషమించటంతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి కుటుంబంలో ఏమైనా కలహాలు ఉన్నాయా? లేదా ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు యత్నించారా? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే కోసంణంలో బంధువులను..స్థానికులను ప్రశ్నిస్తున్నారు. చనిపోయిన ఇద్దరి మృతదేహాలను ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అనతరం దర్యాప్తు ముమ్మరం చేశారు.