రూ.50లక్షలు గోల్ మాల్ : శ్రీశైలం దేవస్థానం పెట్రోల్ బంక్ లో భారీ మోసం
కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం పెట్రోల్ బంక్‌లో అవకతవకలు జరిగాయి. ఆడిట్‌లో 50 లక్షల రూపాయల అవినీతి బయటపడింది. ఆలయ ఈవో రామారావు ఘటనపై చర్యలకు

కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానం పెట్రోల్ బంక్‌లో అవకతవకలు జరిగాయి. ఆడిట్‌లో 50 లక్షల రూపాయల అవినీతి బయటపడింది. ఆలయ ఈవో రామారావు ఘటనపై చర్యలకు
కర్నూలు జిల్లా శ్రీశైలం దేవస్థానం పెట్రోల్ బంక్‌లో అవకతవకలు జరిగాయి. ఆడిట్‌లో 50 లక్షల రూపాయల అవినీతి బయటపడింది. ఆలయ ఈవో రామారావు ఘటనపై చర్యలకు ఆదేశించారు. ఇద్దరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రూ.50లక్షల అవినీతి వ్యవహారం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసలు విచారిస్తున్నారు. అవినీతికి సంబంధించి 4 రోజుల క్రితమే సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఇద్దరికి మాత్రమే సంబంధం ఉందా, లేక పైస్థాయి అధికారుల పాత్ర ఉందా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు.
ఇంత పెద్ద స్థాయిలో గోల్ మాల్ అంటే.. కచ్చితంగా అధికారుల ప్రమేయం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ ఘటన తర్వాత దేవస్థానం అధికారులు అలర్ట్ అయ్యారు.