మా ఊరు ఎందుకొచ్చారు పొండి : వైసీపీ నేతలకు షాక్

  • Published By: veegamteam ,Published On : March 15, 2019 / 06:34 AM IST
మా ఊరు ఎందుకొచ్చారు పొండి : వైసీపీ నేతలకు షాక్

Updated On : March 15, 2019 / 6:34 AM IST

జమ్మలమడుగు : ఎన్నికల వేళ  ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా మరోసారి ఓటు అడిగేందుకు వస్తున్న నేతలకు ప్రజలు అడ్డుకుంటున్నారు..నిలదీస్తున్నారు..ఏం మొఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వస్తున్నారని  ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో కడప జిల్లాలలోని జమ్మలమడుగులో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్‌రెడ్డి..అవినాశ్ రెడ్డిలను మహిళలు అడ్డుకున్నారు.
Read Also: ప్రకాశం టీడీపీ రేసుగుర్రాలు వీళ్లే.. బాలకృష్ణ కారణంగా పూర్తిగా రాని క్లారిటీ!

గత ఐదు సంవత్సరా నుంచి ఎప్పుడైనా మా గ్రామానికి వచ్చారా? మా సమస్యలు పట్టించుకున్నారా..ఎన్నికలు వస్తున్నాయి  కాబట్టి మళ్లీ మేము మీకు గుర్తుకొచ్చామా..ప్రశాంతంగా ఉన్న మా గ్రామంలోకి రావద్దు..మా మధ్య చిచ్చు పెట్టవద్దంటు జమ్మలమండుగు మండంలోనే దేవగుడి, పి.సుగుమంచిపల్లె గ్రామాలకు వెళ్లిన వైసీపీ నేతలను మా ఊర్లో అడుగు పెట్టవద్దంటు స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తు అడ్డుకున్నారు.

దీనికి సదరు నేతలు మాట్లాడుతు..‘మేం రోడ్డుపైనే కదా ఉన్నాం..మీ ఊరికి రాలేదు..మీ ఇంటికి రాలేదు’ అని ఎదురు మాట్లాడేసరికి మరింతగా ఆగ్రహించిన గ్రామస్తులందరూ ఒక్కతాటిపైకి వచ్చి..అడ్డుపడటంతో చేసేదేమీ లేక వైసీపీ నేతలు ఆ ఊరునుంచి వెనుదిరిగారు.అనంతరం మరో గ్రామం అయిన ధర్మాపురం గ్రామానికి వెళ్లిన నేతలు అక్కడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఎంపీగా గెలిచాక వైఎస్ అవినాష్ రెడ్డి తమ గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదని వారు చెబుతున్నారు.