నిప్పుల్లో నాట్యం : దసరా వేడుకల్లో యువకుల భక్తి

నేటి యువత ట్రెండ్ అండ్ ట్రెషీషన్ ఫాలో అవుతున్నారు. పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటూ తమదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. దేశమంతా దసరా వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా యువకులు నిప్పుల్లో నాట్యం చేశాడు. దసరా ఉత్సవాల్లో పాల్గొన్న యువకులు కణకణమండే నిప్పు కణికల మధ్య నాట్యం చేశారు.
దసరా ఉత్సవాల్లో భాగంగా..గుజరాత్ జామ్‌నగర్ పట్టణంలోని రణజీత్‌నగర్‌లో పటేల్ యువ మండల్.. సర్దార్ పటేల్ చౌక్‌లో గర్బా మహోత్సవాన్ని ఏర్పాటుచేసింది. శరన్నవాత్రి వేడుకల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో పలు సంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తున్నారు. నిప్పు కణికల మధ్య యువకులు చేసిన నృత్యం స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. కళ్లప్పగించి ఈ నిప్పుల నాట్యాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నిప్పుల్లో డ్యాన్స్ చేయటానికి తాము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదనీ..పాదాలకు ఎటువంటి లేపనాలు రాసుకోలేదని తెలిపారు.
దసరా వేడుకల్లో నిప్పు కణికల మధ్య చేసే నాట్యాన్ని మషాల్ రాస్అని అంటారు. ఈ నాట్యానికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉండటం విశేషం. ఈనాట్యంలో పాల్గొనేవారంతా రెండు నెలల పాటు ప్రాక్టీస్ చేస్తారు. ఎన్నో తరాలుగా జరుగుతున్న ఈ నిప్పుల నాట్యాన్ని చూడటానికి ప్రజలు దూరప్రాంతాల నుంచి ఇక్కడకు తరలివస్తుంటారు. ఎంతో ఆసక్తిగా తిలకిస్తుంటా. ఈ ఏడాది వేడుకల్లో యువకులు పెద్ద ఎత్తున ఈ నాట్యంలో పాల్గొనటం విశేషమని నిర్వాహకులు తెలిపారు.