ఇలాంటోళ్లు ఎంతమంది ఉంటారు : రూ.50లక్షలు జరిమానా విధించుకున్న మంత్రి హరీష్ రావు
మంత్రి హరీష్ రావు తనకు తాను రూ.50లక్షల జరిమానా విధించుకున్నారు. అదేంటి.. మంత్రి ఫైన్ విధించుకోవడం ఏంటని సందేహం రావొచ్చు. ఆ వివరాల్లోకి వెళితే.. ఓ సభకు హరీష్

మంత్రి హరీష్ రావు తనకు తాను రూ.50లక్షల జరిమానా విధించుకున్నారు. అదేంటి.. మంత్రి ఫైన్ విధించుకోవడం ఏంటని సందేహం రావొచ్చు. ఆ వివరాల్లోకి వెళితే.. ఓ సభకు హరీష్
మంత్రి హరీష్ రావు తనకు తాను రూ.50లక్షల జరిమానా విధించుకున్నారు. అదేంటి.. మంత్రి ఫైన్ విధించుకోవడం ఏంటని సందేహం రావొచ్చు. ఆ వివరాల్లోకి వెళితే.. ఓ సభకు హరీష్ రావు ఆలస్యంగా వచ్చారు. అనుకున్న టైమ్ కన్నా 4 గంటలు లేట్ అయ్యింది. దీంతో ఆయన పరిహారం చెల్లించాలని నిర్ణయించుకున్నారు. తనకు తానుగా రూ.50లక్షలు ఫైన్ వేసుకున్నారు.
మహిళలకు మెప్మా రుణాలు, చెత్తబుట్టల పంపిణీ కోసం శుక్రవారం(నవంబర్ 1,2019) మధ్యాహ్నం 11:30 గంటలకు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఒక సభ ఏర్పాటు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న హరీష్ రావు ఆ సభకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఏవో కారణాలతో సభకు 4 గంటలు లేటుగా అంటే మధ్యాహ్నం 3.30 గంటలకు వచ్చారు హరీష్ రావు. అప్పటిదాకా ఎంతో ఓర్పుగా వేచి చూసిన మహిళలకు.. ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు చెప్పారు హరీష్.
అంతేకాదు పరిహారంగా తనకు జరిమానా విధించాలని వారిని కోరారు. దీంతో తమకు మహిళా భవనం కోసం నిధులను మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంటనే సరేనన్నారు. మహిళా భవన నిర్మాణానికి రూ.50లక్షలను మంజూరు చేయిస్తానని హరీష్ రావు వారికి హామీ ఇచ్చారు.
హరీష్ రావు వైఖరిని స్థానికులు ప్రశంసించారు. ఇలాంటి నిబద్దత కలిగిన నేతలు ఎంతమంది ఉంటారని కితాబిచ్చారు. తన నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆయనను అభిమానించే వారు చాలామందే ఉన్నారు.