రైలు దిగుతూ భార్యాభర్తలు మృతి
విశాఖ జిల్లాలో విషాదం జరిగింది. భార్యభర్తలిద్దరూ రైలు కింద పడి మృతి చెందారు.

విశాఖ జిల్లాలో విషాదం జరిగింది. భార్యభర్తలిద్దరూ రైలు కింద పడి మృతి చెందారు.
విశాఖ జిల్లా గాజువాక మండలం దువ్వాడ రైల్వే స్టేషన్‌లో విషాదం జరిగింది. భార్యభర్తలిద్దరూ రైలు కింద పడి మృతి చెందారు. రమణారావు అనే వ్యక్తి సిఆర్పిఎఫ్ లో పనిచేస్తున్నాడు. భార్యతో కలిసి హైదరాబాద్ నుండి దువ్వాడలోని అత్తవారింటికి ట్రైన్‌లో బయలుదేరారు.
అయితే ట్రైన్ అర్ధరాత్రి దువ్వాడ చేరుకోగా.. ఆ సమయంలో నిద్రమత్తు నుంచి తేరుకుని నడుస్తున్న భార్యభర్తలిద్దరూ ట్రైన్ నుంచి దిగే ప్రయత్నంలో రైలు కింద పడి మృతి చెందారు. వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.