మనిషేనా : భర్త డెడ్ బాడీని చూసి విరగబడి నవ్వింది

కంభం : భర్తకు చిన్న గాయం తగిలితే చాలు భార్య మనసు విలవల్లాడిపోతుంది. అటువంటిది ఓ భార్య భర్తను చంపించేసి ఆ డెడ్ బాడీని చూసి విరగబడి నవ్విన ఘటన స్థానికులను విస్తుపోయేలా చేసింది. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలను కూల్చేస్తున్నాయి. ఈ క్రమంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భార్య తన భర్తను కడతేర్చిన దారుణ సంఘటన ప్రకాశం జిల్లా కంభంలో జరిగింది. అర్ధవీడు మండలంలోని నాగులవరం గ్రామానికి చెందిన రజనీ, జగన్మోహన్ రెడ్డి భార్యభార్తలు. వారికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కంభంలో వున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలోని డాక్టర్ వెంకటనారాయణ వద్దకే వెళ్తుంటారు. ఈ క్రమంలో రజనీ..వెంకట నారాయణ మధ్య సాన్నిహిత్యానికి దారి తీసింది. అదికాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలో అడ్డుగా వున్న రజనీ భర్తను చంపేయాలని ఇద్దరు ప్లాన్ వేశారు.
ఈ క్రమంలో కిరాయి హంతకులకు రూ.10 లక్షలిచ్చి జగన్మోహన్ రెడ్డిని కిడ్నాప్ చేయించాడు వెంకటనారాయణ. తరువాత ఆత్మకూరు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారు. ఇది కాస్తా బైటపడింది. కేసు విచారణ కోసం సంఘటన స్థలానికి రజనీని పోలీసులు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న తన భర్త మృతదేహం చూసి రజనీ నవ్వుకోవటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వారి స్టైల్ లో పోలీసులు విచారించగా..రజనీ అసలు విషయం బైటపెట్టింది. దీంతో డాక్టర్ వెంకటనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో హత్య ..విచారణ..రజనీ నవ్వటం తెలుసుకున్న గ్రామస్థులు రజనీని ఛీకొడుతున్నారు. గతంలో కూడా వెంకటనారాయణకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆ విషయం తెలుసుకున్న సదరు మహిళ బంధువులు ఆయనకు..సదరు మహిళలకు దేహశుద్ధి చేసినట్టు తెలుస్తోంది.