ఆదర్శం : రూ.36 వేలతో కమిషనర్ కుమారుడి పెళ్లి

విశాఖ : ఈరోజుల్లో వివాహం అంటే హంగు..ఆర్భాటం..హడావిడి..భారీ మెనూ ఇలా డబ్బు నీళ్లలా ఖర్చు పెడుతున్న వివాహాలను ఎక్కువగా చూస్తున్నాం. ఈ ఆర్భాటాలకు స్థాయి..ఆర్థిక స్తోమతతో పనిలేకుండా జరుగుతున్నాయి. అటువంటిది ఓ ఐఏఎస్ అధికారి ఇంట్లో వివాహమంటే ఎంతో హడావుడి..భారీ ఖర్చు ఉంటుందని అనుకుంటాం కదూ..దానికి పూర్తి భిన్నంగా తన కుమారుడి వివాహాన్ని జరిపించనున్నరు విశాఖ మెట్రో ప్రాంతీయ అభివృద్ధి మండలి (వీఎంఆర్‌డీఏ) కమిషనర్ పట్నాల బసంత్‌కుమార్.
తన కుమార్తె వివాహాన్ని కేవలం రూ.16,100 వ్యయంతో చేసిన బసంత్ కుమార్ ఇప్పుడు కుమారుడి వివాహానికి కేవలం రూ.36,000 ఖర్చుతోనే వివాహం జరిపించబోతున్నారట. ఫిబ్రవరి 10న విశాఖ నగరంలోని దయాల్‌నగర్‌లో సత్సంగ్ ఆధ్వర్యంలో వివాహం జరనుంది. పెళ్లి కుమార్తె తరఫువారు రూ.18 వేలు, పెళ్లి కుమారుడి తరఫువారు రూ.18 వేలు భరించనున్నారు. వివాహం, విందు భోజనాలకు కలిపి మొత్తం ఖర్చు ఇదేనట. వివాహానికి రెండు రోజుల ముందే (ఫిబ్రవరి 8)త )జరిగే వీరి రిసెప్షన్ కు నూతన వధూవరుల ఆశీర్వాదించేందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరుకానున్నట్లుగా తెలుస్తోంది.