చంద్రబాబుకు నైతికత ఉంటే ఇల్లు ఖాళీ చేయాలి

చంద్రబాబుకు నైతికత ఉంటే వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని ఎమ్మెల్యే ఆళ్ల నానీ అన్నారు. అధికారులు నోటీసులు ఇచ్చి ఇల్లు ఖాళీ చేయండా ఏమీ పట్టనట్లు ఉన్నారనీ..ఇప్పటికైనా స్పందించాలనీ..లేకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదికి భారీగా వరద నీరు చేరుకుంటోందనీ..వరద ప్రమాదం మరోసారి వరద ప్రమాదం వస్తే..చంద్రబాబు నివాసం మునిగిపోయే అవకాశం ఉందని చెబుతున్నా ఆయన పట్టించుకోకుండా ఉంటున్నారని ఆరోపించారు. అధికారులు ఇంతగా చెబుతున్నా..నోటీసులు ఇస్తున్నా..ఇల్లు ఖాళీ చేయటానికి చంద్రబాబుకు ఉన్న అభ్యంతమేంటని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు.కావాలనే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.
చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు ఇస్తున్న నోటీసులపై టీడీపీ నేతలు కూడా ఇష్టాను రీతిగా మాట్లాడుతున్నారనీ..కూల్చుకుంటే కూల్చుకోండి అంటూ వ్యాఖ్యానిస్తున్నారనీ మండిపడ్డారు. పైగా ప్రభుత్వంపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారనీ విమర్శించారు.