జై వాసవీ మాత : వైభవంగా సువర్ణ మందిరం ప్రారంభం

  • Published By: madhu ,Published On : February 16, 2019 / 03:45 AM IST
జై వాసవీ మాత : వైభవంగా సువర్ణ మందిరం ప్రారంభం

Updated On : February 16, 2019 / 3:45 AM IST

ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీ జన్మస్థలమైన పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ఆధ్యాత్మిక వాతావరణం తలపించింది. అఖిల భారత శ్రీవాసవి పెనుగొండ ట్రస్టు ఆధ్వర్యంలో వాసవీధాంలో ఋషిగోత్ర సువర్ణమందిరం ప్రారంభం…90 అడుగుల ఎత్తైన వాసవీమాత పంచలోహ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం ఈ కార్యకమం వైభవోపేతంగా కొనసాగింది. జీఎంఆర్ గ్రూపు, కంపెనీస్ ఛైర్మన్ జి.మల్లిఖార్జునరావు, రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 

90 అడుగులున్న విగ్రహాన్ని చూడటానికి..కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుండి ఆర్యవైశ్యులు భారీగా హాజరయ్యారు. విగ్రహానికి అభిషేకం చేసేందుకు జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ దంపతులు ప్రత్యేక లిఫ్ట్ ఎక్కారు. అనంతపురం జిల్లా పాతూరు నుండి వచ్చిన ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు 102 మంది రుషి వేషాలతో రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాసవీ ధాం అభివృద్ధికి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ క్షేత్రం అభివృద్ధికి రూ. 20 లక్షల విరాళాన్ని ఇస్తానని శిద్ధా ప్రకటించారు.