పోలా..అద్దిరిపోలా : నాగు పాముకు మాస్క్

  • Published By: nagamani ,Published On : August 22, 2020 / 10:56 AM IST
పోలా..అద్దిరిపోలా : నాగు పాముకు మాస్క్

Updated On : August 22, 2020 / 11:19 AM IST

కరోనా మునుషులకే కాదు జంతువులకు కూడా సోకుతుందని పలు సందర్భాల్లో తెలిసింది.కుక్కలు..పిల్లులకు కరోనా వైరస్ సోకిందనే విషయం తెలిసిందే. దీంతో కొంతమంది వారి పెంపుడు జంతువుల ముఖాలకు యజమానుల మాస్కులు కడుతున్న విషయం కూడా తెలిసిందే. కుక్కులు..పిల్లులు..కుందేళ్ళు ఇలా వారి జంతువులకు మాస్క్ లు కట్టుకుంటున్నారు.



కానీ పాములను ఆడించుకునేవాళ్లకు పాములే కదా వారి పెంపుడు జీవులు. అందుకే తాను ఆ పాముమీదనే ఆధారపడి బతుకున్నాను మరి నా పాముకు కరోనా వస్తే నా పరిస్థితి ఏంటీ అంటూ ఓ పాములవాడు తన పాముకు మాస్క్ కట్టేశాడు. హమ్మయ్యా..నా బుజ్జి పాముకు ఇక కరోనా రాదు అంటూ తెగ సంబరపడిపోతున్నాడు.‘నా బుజ్జి పామును పాపిష్టి కరోనా నుంచి కాపాడుకునే బాధ్యత నాదే’ అనుకుని పాము మూతికి మాస్కును కట్టాడు. ఈ విచిత్ర సంఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం, పైడిమడుగులో చోటు చేసుకుంది.

ఆ పామును పెంచుకుంటున్న వ్యక్తి పేరు గంగారం. దానిని ఆడిస్తూ ఆ వచ్చిన డబ్బులతో జీవనం గడుపుతున్నాడు గంగారం. మరి పాములాట ఆడించినప్పుడు జనాలు గుమిగూడుతుంటారు కదూ..అలా వచ్చినవాళ్లు మాస్కులు ధరించడంలేదట. దీంతో గంగారం తన బుజ్జి పాముకు జనాల వల్ల కరోనా సోకుతుందోనని భావించాడు. భయపడ్డాడు. దీంతో తన పాములాటలు చూడటానికి వచ్చేవారందరికీ ‘‘బాబులూ..మాస్కులు పెట్టుకోండి బాబూ’’అంటూ చెబుతున్నాడు. కానీ ఎవ్వరూ వినడంలేదట.



అలాని తన వృత్తిని మానుకోలేడు కదా..ఎవరికి చెప్పినా వినిపించుకోవట్లేదు..ఈ గొడవంతా ఎందుకు నా పాముకే మాస్క్ కట్టేస్తే పోలా..అద్దిరిపోలా నా ఐడియా అనుకుని తన పాముకు మాస్కు కట్టాడు. ఆ పాము అటూ ఇటూ జారుకుంటుంటే జాగ్రత్తగా పట్టుకుని మరీ బుజ్జి పాముకి మాస్కు కట్టాడు. మాస్కు కట్టిన పామును చాలామంది విచిత్రంగా చూస్తున్నారు. దీంతో నా పాములాటల గిరాకీ కూడా భలేకుందంటూ సంబరపడిపోతున్నాడు పాములాట గంగారాం.