కేరళవాసుల దీపావళి: బలి పాడ్యమి

దీపావళి పండుగను పలు పేర్లతో పలు విధాలుగా జరుపుకుంటారు భారతీయులు. అమావాస్య రోజున వచ్చే దీపావళికి తర్వాత రోజును కేరళ ప్రజలు బలిపాడ్యమిగా జరుపుకుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమే ఈ బలిపాడ్యమి. రాక్షసరాజు అయిన బలి చక్రవర్తిని పూజించటం కేరళవాసులు సంప్రదాయం.
కేరళవాసులు బలిచక్రవర్తి కేరళను పాలించాడని అక్కడి ప్రజలు నమ్ముతారు. దీపావళి మరుసటి రోజు అయిన కార్తీక శుద్ధ పాడ్యమి రోజున మహావిష్ణువుతో కలిసి బలి చక్రవర్తి తాను పాలించిన భూలోకాన్ని చూడడానికి వస్తాడని నమ్ముతారు. ప్రతి ఇంటి ముంగిట దీపాలూ, మామిడితోరణాలు, రంగురంగుల ముగ్గులూ ఉండటం చూసి, తన రాజ్యంలో ప్రజలందరూ ఆనందం, ఉత్సాహం, భోగభాగ్యాలతో హాయిగా ఉన్నరాని బలి సంతోషపడతాడు. అందువల్ల దీపావళి మరుసటి రోజు ‘బలి పాడ్యమి ‘అయ్యింది.
ప్రజల క్షేమం కోసం వచ్చే బలిచక్రవర్తిని ఈ రోజున పూజిస్తారు. బలి చక్రవర్తిని గౌరవిస్తు దానాలు కూడా చేస్తారు కేరళవాసులు. బలి పాడ్యమి’ రోజున దానం చేయడం చేస్తే తమకున్న సంపదలు తరిగిపోకుండా పెరుగుతాయని నమ్ముతారు.
బలి భార్య విద్యావతిని పూజించే సంప్రదాయం
రాక్షసులలో ఉత్తముడై బలి. రాక్షసులకు బలి చక్రవర్తి. బలి మనస్సు చాలా మంచిది. తన ముందు చేయి చాచినవాడికి లేదు..కాదు అనే మాట లేకుండా నిండైన మనస్సుతో దానమిచ్చే దానశీలి. ఇచ్చిన మాట తప్పనివాడు. ధర్మం బాటలో నడిచేవాడు. అత్యంత బలవంతుడు. ఆత్మ విశ్వాసం నిండుగా ఉన్నవాడు బలి చక్రవర్తి. అయితే బలి రాక్షసులకు చక్రవర్తి కాబట్టి వారి రక్షణ బాధ్యత పూర్తిగా ఆయనే వహించాడు. ఈ క్రమంలో దేవతలపై కూడా సమరం సాగించాడు. ఇంద్రుడ్ని ముప్పు తిప్పలు పెట్టి దండయాత్ర చేసాడు. వజ్ర, వైఢూర్యాలు, మునిమాణిఖ్యాలు దానమివ్వడమే కాదు..తనను తాను శత్రువుకు దానం ఇచ్చుకున్న వితరణ శీలి బలిచక్రవర్తి. బలిని, ఆయన భార్య విద్యావతిని పూజించే సంప్రదాయం కూడ కేరళలో ఉంది.