గవర్నమెంట్ డాక్టర్ల నిర్లక్ష్యం : డెలివరీ చేసిన నర్సులు..శిశువు మృతి

పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం..నర్సుల చేతకాని తనంతో ఓ తల్లికి కడుపు శోకం మిగిలింది. నర్సులు చేసిన డెలివరీతో బిడ్డ మృతి చెందింది. దీంతో బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.
పెదపాడుకు చెందిన ఝాన్సీ లక్ష్మీ అనే మహిళకు ఉదయం 6 గంటలకు పురిటి నొప్పులో ఆస్పత్రిలో చేరింది. నార్మల్ డెలివరీ చేస్తాం అంటూ ఝాన్సీకి కడుపు కోత మిగిల్చిన ప్రభుత్వ ఆస్పత్రిలోని నర్సులు. ఆసుపత్రిలో వైద్యులు రాకపోవడంతో గంటలపాటు వేచిచూశారు. కానీ డాక్టర్ల జాడ మాత్రం లేదు. దీంతో ఝూన్సీకి నర్సులే డెలీవరీ చేసేందుకు యత్నించారు. కానీ డెలివరీ టైమ్ లో శిశువు పేగు మెడను వేసుకుని పుట్టటంతో నర్సులు పేగును కట్ చేశారు. దీంతో శిశువు మెడపై తీవ్ర గాయాలయి మృతి చెందింది.
దీంతో బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనతో పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. తామే డెలివరీ చేశామని స్టాఫ్ నర్సులు ఒప్పుకుంది. కాగా డెలీవరీ కేసులన్నీ తామే చేస్తామని తెలిపారు నర్సులు. కానీ ఆ సమయంలోనే తాను ఆస్పత్రిలోనే ఉన్నాననీ..ఝూన్సీకి డెలివరీ తానే చేసానని డ్యూటీ డాక్టర్ సుష్మ బుకాయిస్తోంది. కాగా దుర్గారావు భార్య ఝాన్సీ లక్ష్మికి ఇదే తొలి కాన్పు కావటం..పుట్టిన బిడ్డ మృతి చెందటంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు బంధువులు.
కాగా ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సులు కబుర్లు చెప్పుకుంటు.. సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకోవడం తప్ప రోగులను పట్టివంచుకోవటంలేదని..స్దానికులు ఆరోపిస్తున్నారు.