నాన్ బెయిలబుల్ కేసులు, 6నెలలు జైలు : మద్యపాన నిషేధం దిశగా మరో అడుగు
ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా జగన్ సర్కార్ మరో అడుగు వేసింది. ఏపీలో బార్ల పాలసీపై సీఎం జగన్ మంగళవారం(నవంబర్ 19,2019) అధికారులతో సమీక్ష

ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా జగన్ సర్కార్ మరో అడుగు వేసింది. ఏపీలో బార్ల పాలసీపై సీఎం జగన్ మంగళవారం(నవంబర్ 19,2019) అధికారులతో సమీక్ష
ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా జగన్ సర్కార్ మరో అడుగు వేసింది. ఏపీలో బార్ల పాలసీపై సీఎం జగన్ మంగళవారం(నవంబర్ 19,2019) అధికారులతో సమీక్ష నిర్వహించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2020 జనవరి నుంచి కొత్త బార్ల విధానం అమల్లోకి తేనున్నారు. రాష్ట్రంలో బార్ల సంఖ్యను 40శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. స్టార్ హోటళ్లు మినహా ప్రస్తుతం 798 బార్లు ఉన్నాయి. వాటిని 40శాతానికి తగ్గించాలని నిర్ణయించారు.
అంతేకాదు బార్లకు అప్లికేషన్, లైసెన్స్ ఫీజు భారీగా పెంచాలని నిర్ణయించారు. బార్లలో మద్యం సరఫరా వేళలను కుదించారు. ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే మద్యం సరఫరాకు పర్మిషన్ ఇస్తారు. స్టార్ హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు మాత్రమే బార్లు ఓపెన్ లో ఉండాలి. బార్లకు సరఫరా చేసే మద్యం ధరలు పెంచుతారు. మద్యం కల్తీ చేసినా, నాటు సారా తయారు చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలన్నారు. లైసెన్స్ ఫీజుకి 3 రెట్లు జరిమానా విధించడంతో పాటు 6 నెలలు జైలు శిక్ష పడుతుందన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ మేరకు చట్టం తీసుకొస్తామన్నారు. ఇక లాటరీ పద్ధతిలో బార్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.