తుళ్లూరులో సహాయ నిరాకరణోద్యమం : పోలీసులకు నో ఫుడ్, నో వాటర్

రాజధానిగా అమరావతే ఉండాలంటూ ఉద్యమం చేస్తున్నా ఆప్రాంత రైతులు పోలీసులకు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ అవలంభించిన పద్దతిని చేపట్టారు తుళ్లూరు గ్రామస్థులు. అప్పుడు బ్రిటీష్ వారికి సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తే నేడు రాజధాని అమరావతి కోసం తుళ్లూరు గ్రామస్తులు పోలీసులకు సహాయ నిరాకరణ చేపట్టారు.
తుళ్లూరు గ్రామంలో పోలీసులు కొన్ని రోజుల నుంచి అక్కడే కాపు కాసారు. రాత్రి, పగలూ అక్కడే ఉంటున్నారు. అక్కడే ఉండే పోలీసులు స్థానికంగా ఉండే హోటల్స్ లోనే భోజనాలు..టిఫిన్లు తింటున్నారు. ఈ క్రమంలో పోలీసులు చేస్తున్న దౌర్జన్యంపై ఆగ్రహం వ్యక్తంచేసిన గ్రామస్తులు వారికి హోటల్స్ లో భోజనాలుగానీ..టిఫిన్లు, టీలు..వాటర్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో పోలీసులు వాటర్, టిఫిన్లు బైటనుంచి తెప్పించుకుంటున్నారు.
కొంతమంది పోలీసులకు స్థానికులే భోజనాలు పెడుతున్నారు. వారిని కొట్టిన పోలీసులకే స్థానికులు ఆహారం పెడతున్నారు. తాగటానికి నీళ్లు ఇస్తున్నారు. కానీ శుక్రవారం (జనవరి 10,2020)న పోలీసులు గ్రామస్థులపై చేసిన దౌర్జన్యం అంతా ఇంతా కాదు. మహిళలని..యువతులని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు కొట్టారు. రక్త కారేలా కొట్టారు. కనకదుర్గమ్మ దేవాలయానికి ర్యాలీగా వెళ్లాలనుకున్న మహిళలపై తమ ప్రతాపాన్ని చూపెట్టారు. కనిపించినవారిని కనిపించినట్లుగా లాఠీలతో చావబాదారు. దీంతో మహిళలు, యువతులు పోలీసులపై ఎదురు తిరిగారు. గుడికి వెళ్తున్న మమ్మల్ని ఎందుక కొడుతున్నారు? మేము ఉగ్రవాదులమా? మేము ఏపీలో ఉన్నామా? పాకిస్తాన్ లో ఉన్నామా? అని ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగారు.
దీంతో పోలీసులు మహిళలపై కూడా లాఠీ చార్జ్ చేశారు. దీంతో పోలీసులకు టిఫిన్లు, టీలు..వాటర్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో పోలీసులు వాటర్, టిఫిన్లు బైటనుంచి తెప్పించుకుంటున్నారు.