రెవెన్యూ సిబ్బందికి లంచంగా మంగళసూత్రం తీసిచ్చిన మహిళ

రెవెన్యూ సిబ్బందికి లంచంగా మంగళసూత్రం తీసిచ్చిన మహిళ

Updated On : February 20, 2020 / 7:48 AM IST

రెవెన్యూ అధికారులు సాధారణ ప్రజలపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్న తీరు దారుణంగా అనిపిస్తుంది. పేద ప్రజలకు కేటాయించిన స్థలాలను లంచాలకు ఆశపడి కబ్జాదారులకు అప్పగించేందుకు పూనుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అధికారిపై లంచాలు తీసుకుంటున్నారంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. 

గతంలో ఓ కులానికి సంబంధించి ఇళ్ల స్థలాలను కేటాయించి ప్రభుత్వం. దీనిపై కబ్జాదారుల కన్నుపడింది. వారి ప్రభావంతోనే స్థలాలను పట్టించుకోవడం మానేసింది. ఈ క్రమంలోనే వారికి కరెంట్, వాటర్ సప్లై ఆపేసి కనీస వనరులు లేకుండా చిత్రీకరించి ఖాళీ చేయించాలని టార్గెట్ చేసుకున్నారు. 

రెవెన్యూ అధికారుల ఆగడాలకు స్థానికులు ఆందోళన దిగారు. ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. భూ కబ్జాదారులకు మాదిరి తాము లంచాలు ఇచ్చుకునే స్తోమత లేదని.. కూలీ పని చేసుకుని బతికే వాళ్ల దగ్గర ఇంతకుమించి ఏముంటాయని ఆవేదన వెల్లగక్కారు. 

సిబ్బందికి లంచాలు ఇచ్చేందుకు విరాళాలు సేకరించగా తోచినంత సాయం చేయగా  కొందరు డబ్బులు, ఫోన్లు ఇచ్చారు. ఓ మహిళ మంగళసూత్రం తీసిచ్చేయడం గమనార్హం. 

Read More>>Answer Sheetలో వంద రూపాయలు పెట్టండి.. జై హింద్, జై భారత్: ప్రిన్సిపాల్ సలహా