ఏళ్లుగా సేవలందించింది : శునకానికి సెల్యూట్

  • Published By: madhu ,Published On : January 16, 2019 / 02:15 PM IST
ఏళ్లుగా సేవలందించింది :  శునకానికి సెల్యూట్

Updated On : January 16, 2019 / 2:15 PM IST

కరీంనగర్ : అనారోగ్యంతో మరణించిన పోలీస్ శునకము క్లాసీకి… పోలీసులు అరుదైన గౌరవాన్ని అందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా  సేవలందించి.. ఎన్నో కేసులలో కీలక పాత్ర పోషించిన క్లాసీకి…రామగుండం సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో అధికార లాంచానాలతో అంత్యక్రియలు నిర్వహించారు. క్లాసీ 2008 సంవత్సరంలో 9 నెలల పోలీస్ శిక్షణ పూర్తి చేసుకొని…11 ఏళ్లు   పోలీస్ శాఖకి ప్రత్యేక  సేవలందించింది. క్లాసీకి 2017లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ప్రశంసా పత్రంతో సత్కరించారు.