IPL-2019 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఐపీఎల్ లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ఇవాళ(మార్చి-25,2019) కింగ్స్ ఎలెవన్ పంజాబ్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది.టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో జరిగిన మూడు మ్యాచ్‌లు చాలా ఆసక్తిగా సాగాయి. ముఖ్యంగా ఏడాదిపాటు నిషేధాన్ని ఎదురుకొన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ రోజు ఒక అతి పెద్ద టోర్నమెంట్ లో పాల్గొననున్నాడు. మరోవైపు విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ కూడా టీ-20ల్లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో అభిమానులు ముఖ్యంగా వీరిద్దరి బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
టాస్ సందర్భంగా పంజాబ్ జట్టు కెప్టెన్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘చాలా మంది యువ క్రికెటర్ల మా జట్టు తరఫున వారి భవిష్యత్తును పరిష్కరించుకోనున్నారు. వికెట్ రెండో ఇన్నింగ్స్ వరకూ మారుతుందని అనుకోవడం లేదు. కానీ మేం టాస్ గెలిచినా బౌలింగ్ నే ఎంచుకొనే వాళ్లం. గత ఏడాది జరిగిన తప్పుల నుంచి చాలా నేర్చుకున్నారు. ఈసారి మా జట్టు రాణిస్తుందనే నమ్మకం నాకు ఉంది’’ అని అన్నాడు.
ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్యా రహానే మాట్లాడుతూ.. ‘‘మంచి ఆరంభం లభించడం అందరికీ అవసరం. మంచి ఆరంభంకోసం మేం ఎదురుచూస్తున్నాం. మా ప్లాన్‌ల ప్రకారమే మేం ముందుకు వెళ్తాం అని తెలిపారు.
.@ajinkyarahane88 wins the toss and elects to bowl first against @lionsdenkxip #VIVOIPL #RRvKXIP pic.twitter.com/BDIEvDkL1c
— IndianPremierLeague (@IPL) March 25, 2019