రిపబ్లిక్ డే అంటే ఏమిటి?

మన దేశానికి 1947 ఆగష్టు 15 న స్వాతంత్రం వచ్చింది. కానీ వాస్తవంగా స్వాతంత్ర్యం రాగానే రాజ్యం పాలనలోకి రాలేదు దానికి కొన్ని కట్టుబాట్లు నడవడికలు ఏర్పరచుకోవాలి… అంటే ఒక రాజ్యం పూర్తిగా నియమ నిబద్ధతలో నడవాలంటే ఒక రాజ్యాంగం అవసరం. ఈ రాజ్యాంగం అనేది రాజ్యంలోని ఒక అంగం అన్నమాట. దేశంలోని అన్నిరకాల వ్యవస్థలు దీనిని అనుసరించే నడుస్తాయి(అంటే ప్రజల సాధారణ జీవితం ఎలా నడవాలో దగ్గర నుండి.. చట్టసభలు, పోలీసు స్టేషన్, డాక్టర్, లాయర్ లాంటి వృత్తులనుండి మొదలు.. ఎలా నడవాలి అని తెలిపే ఒక గ్రంథం కావాలి.. దీనిలో లేని విధంగా రాజ్యం నడవదు..) అందుకే ఇలాంటి రాజ్యాంగం కోసం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ అప్పటి ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల రాజ్యాంగాలను పరిశీలించి వాటిలోని మంచిని గ్రహించి రూపొందించబడినదే మన రాజ్యాంగం.. ప్రస్తుతం ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన మన భారతీయ రాజ్యాంగం ఎంతో గౌరవించదగినది..
అయితే ఈ రాజ్యాంగం రచన 1947లో మొదలు పెట్టినా.. 1950 జనవరి 26 న కానీ ముగియలేదు అప్పటి వరకు ఎందుకు ఆగారంటే… 26 జనవరి 1930 న పూర్ణ స్వరాజ్ కు భారత జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చిన రోజు ఆ రోజు నుంచే స్వాంతంత్ర్య కాంక్ష ఎక్కువవుతూ చివరికి స్వాతంత్ర్యం ఇచ్చేంత వరకు కొనసాగిందన్న మాట.. అందుకే మనకు 26 జనవరి అత్యంత ప్రాముఖ్యమైన రోజు. భారతదేశానికి మూడు జాతీయ సెలవు దినాలలో ఇది ఒకటి. మిగతావి స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి. ఈ రోజు డిల్లీలో పరేడ్లు నిర్వహిస్తారు సాహస బాల బాలికలకు భారత రాష్ట్రపతి పురస్కారాలు అందజేస్తారు.
మన దేశంలో రాజ్యాంగం ప్రకారమే చాలా వ్యవస్థలు నడుస్తాయి.. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, యంఎల్ ఏ, యంపి, లాంటి ముఖ్యులంతా ఈ రాజ్యాంగం ప్రకారం నడచుకోవలసినదే… ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలలో మన రాజ్యాంగం మించినది లేదు.. చివరికి ఫ్రాన్స్ అమెరికా రాజ్యాంగాలు డా మనకంటే దిగదుడుపే. మనం ఇంత స్వతంత్రంగా జీవించ గలగుతున్నందుకు భారతీయులమైనందుకు తప్పని సరిగా గర్వపడాలి…!