శ్రీముఖి ‘వీణ స్టెప్’ ఎలా వేసిందో చూశారా..

  • Published By: sekhar ,Published On : October 9, 2020 / 06:28 PM IST
శ్రీముఖి ‘వీణ స్టెప్’ ఎలా వేసిందో చూశారా..

Updated On : October 10, 2020 / 11:58 AM IST

Anchor Sreemukhi: మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ సినిమాలో ‘దాయి దాయి దామ్మా’ పాటలో వేసిన వీణ స్టెప్ ఎంత పాపులర్ అయిందో కొత్తగా చెప్పనవసరం లేదు.. ఇప్పటికే చాలా సినిమాల్లో ఈ స్టెప్ అనుకరించారు. పవర్‌‌స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో వీణ స్టెప్ వేశారు.


తాజాగా టాలీవుడ్ Anchor Sreemukhi సరదాగా చిరు వీణ స్టెప్ ట్రై చేసింది.
Mahathalli గా పాపులర్ అయిన Jahnavi తో కలిసి తన యూట్యూబ్ ఛానెల్ కోసం ఫేమస్ Oh Womaniya పాటకు కాలనీ అమ్మలు, అత్తలు కాలుకదిపితే ఎలా ఉంటుందో చేసి చూపించారు.


తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ప్రోమో లాంటి వీడియోలో శ్రీముఖి వీణ స్టెప్ కాస్త వెరైటీగా వేసింది. ఈ వీడియోకి శ్రీముఖి ఫ్యాన్స్ అలాగే నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా శుక్రవారం ఫుల్ ఎపిసోడ్ అప్‌లోడ్ చేశారు.

https://www.instagram.com/p/CGFIuE7pG6r/?utm_source=ig_web_copy_link