ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్
ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకి ఎన్ ఎంయూ సమ్మె నోటీస్ అందించింది.

ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకి ఎన్ ఎంయూ సమ్మె నోటీస్ అందించింది.
ఏపీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకి బుధవారం (మే8, 2019)న ఎన్ ఎంయూ సమ్మె నోటీస్ అందించింది. 46 డిమాండ్లను ఆర్టీసీ ఎండీ ముందుంచింది. కార్మికుల వేతన సవరణ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యుటీ తగ్గింపు, సిబ్బంది కుదింపు, అద్దె బస్సుల పెంపు వంటి తదితర నిర్ణయాలను ఉపసంహరించుకోవాలన్నారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన 670 కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే మే 22 తర్వాత సమ్మెకు దిగుతామని ఎన్ఎంయూ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.
25 శాతం తాత్కాలిక ఫిట్ మెంట్ ఇవ్వాలని, మొదటి విడత కింద 40 శాతం భత్యాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే వీటికి సంబంధించి స్పష్టమైన హామీ వచ్చిందని.. అయితే ఇంత వరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు డిమాండ్లతోపాటు మరో 44 సమస్యలను పరిష్కరించాలంటూ ఎండీ సురేంద్రబాబుకి ఎన్ ఎంయూ సమ్మె నోటీస్ ఇచ్చింది. గురువారం (మే 9, 2019)న ఆర్టీసీ ఎంప్లాయిస్ (ఈయూ) జేఏసీ సమ్మె నోటీస్ అందజేయనుంది.