అమరావతి గ్రామాల్లో 6 వందల మంది పోలీసులు : డీఎస్పీ శ్రీనివాస రెడ్డి

అమరావతి రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మూడు రాజధానులు ప్రకటను వ్యతిరేకిస్తూ రైతులు..మహిళలు..విద్యార్థులు..ప్రజాసంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నా క్రమంలో ఆయా ప్రాంతాలలో ప్రభుత్వం పోలీసుల్ని భారీగా మోహరించింది. అమరాతి ప్రాంతంలోని 29 గ్రామాలన్నీ పోలీసుల పహారా మధ్యా ఉన్నాయి.
ఈ సందర్బంగా.. తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ..అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో ఆరు వందలమంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని డీఎస్పీ 10టీవీకి తెలిపారు. రైతులు..మహిళలు తమ నిరసనలను..ఆందోళనలకు శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించేలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని..సచివాలయానికి వెళ్లే ప్రజాప్రతినిథుల్ని గానీ..అధికారుల్ని అడ్డుకుంటే ఊరుకోమని హెచ్చరించారు. వారికి తగిన భద్రత కల్పించామని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస రెడ్డి తెలిపారు.
ఈ క్రమంలో అమరావతి ప్రాంతంలోని తాడికొండ, మంగళగిరి ఎమ్మెల్యేలకు పోలీసుల భద్రతను కట్టుదిట్టంచేశారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖుల ఇళ్ల దగ్గర ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోను పోలీసులు నిరంతరం పహారా కాస్తున్నారు. నిరసనకారులు ఆయా ప్రాంతాలకు రాకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాగా..ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటనతో ఏపీ అట్టుడికిపోతొోంది. నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆందోళనలకు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులకు పోలీసులు భద్రతను పెంచారు. అమరావతి ప్రాంతంలోని గ్రామాలల్లో పోలీసులు భారీగా మోహరించారు.