Suravaram Sudhakar Reddy: సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత..

హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Suravaram Sudhakar Reddy: సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత..

Updated On : August 22, 2025 / 11:25 PM IST

Suravaram Sudhakar Reddy: సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంత
కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 1998, 2004లో లోక్ సభ ఎంపీగా గెలిచారు సుధాకర్ రెడ్డి. 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సురవరం సీపీఐలో అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్ర కార్యదర్శి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.

అనారోగ్య సమస్యలతో సురవరం కొంతకాలం ఆసుపత్రికే పరిమితం అయ్యారు. తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పార్టీలోనూ క్రియాశీలక పాత్ర పోషించారు సురవరం సుధాకర్ రెడ్డి. తెలంగాణ నుంచి సుదీర్ఘ కాలం పాటు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తన జీవిత కాలం పార్టీ కోసం అంకిత భావంతో పని చేసిన నేతగా గుర్తింపు పొందారు.