ట్రంప్ ఫోటోలు, ప్లకార్డులతో అమరావతిలో నిరసనలు

రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రుల ఏకైక రాజధానిగా అమరావతి నగరమే ఉంచాలంటూ.. 29 గ్రామాల ప్రజలు దీక్షలు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే 70రోజుల నుంచి దీక్షల్లో పాల్గొంటున్న అమరావతి రైతులు.. లేటెస్ట్‌గా ట్రంప్ ఫోటోలతో అమరావతిలో నిరసనలు హోరెత్తిస్తున్నారు.
భారత్ పర్యటనకు వచ్చిన ట్రంప్ ఫోటోలను ప్లకార్డులలో పెట్టి, అమరావతినే ఏపీ రాజధానిగా కొనాసాగించాలంటూ నినాదాలు చేశారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తూనే విభిన్నంగా తమ నిరసనలు తెలియజేస్తున్న అమరావతి రైతులు.. ఎ ఆఫ్ అమెరికా, ఎ ఫర్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. అమెరికాకు ఒకటే రాజధాని ఉంది కానీ సీఎం జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఫ్లకార్డుల్లో రాశారు.
Read More>>ఏపీ సిట్‌కు సంపూర్ణ అధికారాలు.. ఎవరైనాసరే తప్పించుకోలేరు!
అమరావతి విషయంలో సీఎం జగన్ మనసు మార్చుకోవాలని, అప్పటివరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలోని పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు అమరావతి రైతులు.