అలాస్కాను కుదిపేసిన భారీ భూకంపం..

  • Published By: nagamani ,Published On : July 23, 2020 / 08:18 AM IST
అలాస్కాను కుదిపేసిన భారీ భూకంపం..

Updated On : July 23, 2020 / 8:51 AM IST

ఉత్తర అమెరికాలోని అలాస్కా పీఠభూమిని భారీ భూకంపం కుదిపేసింది. మంగళవారం రాత్రి సంభవించిన ఈ భూకంపం ఆంకోరేజ్‌కు నైరుతి దిశగా 800 కిలోమీటర్లు, పెర్రివిలేకు ఆగ్నేయంగా 96 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. ఈ విపత్తుతో అప్రమత్తమైన అధికారులు పెర్రివిల్లెకు ఆగ్నేయంలో భూకంపం కేంద్రం నుంచి సుమారు 300 కిలోమీటర్ల వరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

సముద్ర తీర ప్రాంతాల్లోని వారితోపాటు దీవుల్లో, దిగువ ప్రాంతాల్లో ఉన్న వారిని అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. కిలోమీటర్ల వరకు అలలు దూసుకువచ్చే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీంతో సముద్ర తీరాలకు ఎవ్వరూవెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. కాగా.. భూకంపం తర్వాత కూడా చాలా సేపటి వరకు అలలు సాధారణంగానే ఉండడంతో సునామీ హెచ్చరికలను ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారు.
అలస్కాన్ ద్వీపకల్పం చివరి నుంచి మరొక ద్వీపంలో సుమారు 1,000 మంది జనాభా ఉన్న సాండ్ పాయింట్ దగ్గరగా ఉంది. ఈ ప్రాంతంలో ఇసుక పాయింట్ ఖాళీ చేసి దాని అత్యవసర సైరన్లను వినిపించింది అధికార యంత్రాంగం.