సంగారెడ్డి జిల్లాలో రెండు ప్రమాదాలు : నలుగురు మృతి 

  • Published By: veegamteam ,Published On : May 10, 2019 / 06:02 AM IST
సంగారెడ్డి జిల్లాలో రెండు ప్రమాదాలు : నలుగురు మృతి 

Updated On : May 10, 2019 / 6:02 AM IST

సంగారెడ్డి జిల్లాలో రెండు  రోడ్డు ప్రమాదాలు సంభవించాయి.  ఈ ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద కంటైనర్ వాహనం – డీసీఎం వ్యాను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఝరాసంఘం మండలం గినియార్‌పల్లి వాసులుగా గుర్తించారు. గాయపడినవారిని జహీరాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 
 

అలాగే జిల్లాలోని పటాన్‌చెరు మండలం మహేశ్వరం వద్ద లారీ బీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థానాలకు చేరుకుని గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అనంతరం ఈ రెండు ఘటనలపై ఆయా ప్రాంత పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మహేశ్వరం వద్ద జరిగిన ప్రమాదానికి గురైనవారు బీహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు.