రిజర్వేషన్ : ఇకనుంచి బస్సుల్లో ట్రాన్స్‌జెండర్లకు సీట్లు..

ట్రాన్స్ జెండర్లు.వీరికి సమాజంలో సరైన గుర్తింపులేదు. అవమానాలు..చీదరింపులు..ఛీత్కారాలు. అలాగే వీరికి బస్సుల్లో వీరికి ప్రత్యేకించి సీట్లు కూడా ఉండవు. దీంతో వీరు బస్సుల్లో ప్రయాణించరు..కానీ పశ్చిమ బెంగాల్ లో వీరి కోసం బస్సుల్లో ప్రత్యేకించి సీట్లు కేటాయించారు. వారి కోసం రెండు సీట్లు రిజర్వ్ చేశారు.
సాధారణంగా బస్సుల్లో మహిళలకు, వికలాంగులకు,సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకించి సీట్లు కేటాయించి ఉంటాయి. కానీ ట్రాన్స్ జెంటర్లకు మాత్రం సీట్లు ఉండవు. దీంతో వారు బస్సుల్లో ప్రయాణించరు. ఇకనుంచి వారు ఆ ఇబ్బందు పడనక్కర్లేదంటోంది పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ ప్రైవేటు బస్సు ఆపరేటర్ల సంఘం.
తమ కంపెనీకి చెందిన బస్సుల్లో రెండు సీట్లను ట్రాన్స్‌జెండర్లకు కేటాయించాలని నిర్ణయించింది. బస్సుల్లోని రెండు సీట్లపై త్రిధార అని ట్రాన్స్ జెండర్ల కోసం మార్క్ చేయనున్నట్టు ప్రైవేటు బస్సు ఆపరేటర్ల జాయింట్ కౌన్సిల్ ఆఫ్ బస్ సిండికేట్స్ ప్రధాన కార్యదర్శి తపన్ బెనర్జీ తెలిపారు.
దీనిపై తపన్ బెనర్జీ మాట్లాడుతూ..మా సంఘానికి రాష్ట్రంలో సుమారు 40 వేల బస్సులు ఉన్నాయనీ..ఈ బస్సుల్లో ట్రాన్స్ జెండర్ల కోసం సీట్లను రిజర్వ్ చేయడమే కాదు, వారిని సమానంగా చూడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.దీంట్లో భాగంగానే కోల్‌కతా సిటీలో ఇప్పటికే కొన్ని బస్సులకు మార్కింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు. ఇతర ప్రైవేటు ఆపరేటర్లు కూడా రెండు సీట్లను ట్రాన్స్‌జెండర్లకు రిజర్వ్ చేయాలని సూచించారు.
“ఇది కేవలం రెండు సీట్లను కేటాయించడం మాత్రమే కాదని..లింగమార్పిడి వ్యక్తులను గుర్తించడం అందరి ప్రయాణికులలో వలెనే వారిని సమానంగా పరిగణించటానికి అవగాహన కల్పించడమే మా ఈ నిర్ణయం ఉద్ధేశమని బెనర్జీ తెలిపారు.