గుంటూరులో రోజాకు నిరసన సెగ..కాన్వాయ్‌ని అడ్డుకున్న రైతులు: వాళ్లంతా టీడీపీ గూండాలే

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజాకు రాజధాని గ్రామాల్లో అడుగడుగునా నిరసరనల సెగ ఎదురైంది. నేలపాడు ఎస్‌ఆర్ఎం యూనివర్సిటీ నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా పెదపరిమి వద్ద రోజా వాహనాన్ని అమరావతి ప్రాంత రైతులు అడ్డుకున్నారు. వాహనాన్ని ముందుకు వెళ్లనీయకుండా అడ్డుగా నిల్చున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానిపై రోజా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రైతులను అడ్డుకున్నారు.
నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమ్మిట్‌లో రోజా పాల్గొన్నారు. విషయం తెలిసిన మహిళలు అక్కడకు చేరుకుని సమ్మిట్ బయట ఆందోళనకు దిగారు. అమరావతికి న్యాయం చేయాలంటూ మహిళలు నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రోజాను వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మహిళలు రోజా కాన్వాయ్‌ను వెంబడించారు. ఈ ఘటనతో యూనివర్సిటీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
దీంతో రోజు ఆందోళ చేస్తున్నవారిపై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తనపై దాడి చంద్రబాబు కుట్రేనని ఆరోపించారు. రైతుల ముసుగులో చంద్రబాబు తనపైకి గూండాల్ని పంపించి దాడులు చేయిస్తున్నారని రోజు ఆరోపించారు. ఇటువంటి ఆందోళనలను పట్టించోబోమనీ..మూడు రాజధానుల నిర్మాణం జరిగి తీరుతుందని దీనికి ఎవ్వరు అడ్డు వచ్చినా ఆగదని రోజా స్పష్టం చేశారు.